పోటెత్తిన భక్తజనం
బూర్గంపాడు: మండలంలోని పురాతన ఆలయాలైన పెద్దరావిగూడెం కేదారేశ్యరస్వామి, మోతెగడ్డలోనివీరభద్రస్వామి ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. గోదావరి నదీతీరం లోని ఈ రెండు శైవక్షేత్రాలు మహాశివరాత్రి జాతరకు ప్రసిద్ధి చెందాయి. తెల్లవారుజామునుంచే భక్తులు వచ్చి గోదావరి నదిలో స్నానాలు చేసి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.