పోడుభూములకు పట్టాలు ఇవ్వాలి

విశాఖపట్టణం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):ఎస్సీ, ఎస్టీ, భూమి లేని నిరుపేదలకు ఒక్కో కుటుంబానికి అయిదు
ఎకరాల చొప్పున పంట భూమిని కొనుగోలు చేసి ఇవ్వాల గిరిజన సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.   గిరిజనులు సాగు చేసుకున్న కొండపోడులకు సాగు పట్టాలివ్వాలని అన్నారు. గిరిజనులు 30 ఏళ్లగా కొండపోడులను సాగు చేసుకున్నారని, హక్కు పత్రాలివ్వాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదన్నారు.
వీరు సాగు చేసుకున్న 200 ఎకరాలకు పట్టాలివ్వకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. భూమిపంపిణీ చేయాలన్న ఉత్తర్వులు  ఉన్నా ప్రభుత్వం ఇప్పటివరకు అటువంటి కార్యక్రమం చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. అణుకు గ్రామానికి ఏర్పాటు చేసిన రహదారి అధ్వానంగా ఉండటంతో
రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే అరకు రహదారిని నిర్మించాలని డిమాండ్‌ చేశారు.