పోడు భూముల క్లైమ్ ల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలి
పోడు వ్యవసాయదారులందరికీ పట్టాలు అందించే విధంగా పారదర్శకంగా పనిచేయాలి:జిల్లా కలెక్టర్ కె.శశాంక
కొత్తగూడ అక్టోబర్ 08 జనంసాక్షి:కొత్తగూడ,గూడూరు మం డలాలలో పోడు భూముల క్లెయిమ్స్ పరిశీలన సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు.కొత్తగూడ మండలం మాసంపల్లి తండా,గాంధీనగర్,గూడూరు మండలం సీతానగరం లో జరుగుతున్న పరిశీలన,వివరాల సేకరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా అధికారులకు,ఎఫ్ ఆర్ సి కమిటీలకు స్థానిక ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేస్తూ,అర్హులైన పోడు వ్యవసాయ దారులందరికి పట్టాలు అందించే విధంగా ఎఫ్ ఆర్ సి కమిటీలు ప్రజాప్రతినిధుల సమన్వయంతో గ్రామ,మండల స్థాయి అధికారులకు సహకరించాలని కలెక్టర్ తెలిపారు.అటవీ రెవెన్యూ శాఖ సమన్వయంతో తమ రికార్డులు,మ్యాప్ ద్వారా భూ వివరాలను సరిచూసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఆన్ లైన్ లో వచ్చిన ప్రతి క్లైమ్ ను పరిశీలించాలని తదనుగుణంగా సర్వే బృందం పనిచేయాలని కలెక్టర్ అన్నారు.గ్రామ మండల స్థాయి లో పరిష్కారం కానీ సమస్యలను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తేవాలన్నారు.కొత్తగూడ మండలంలో 35 వేల 347 ఎకరాలకు గాను 8వేల 617 క్లైమ్ లు అందాయని,అదేవిధంగా గూడూరు మండలానికి సంబంధించి16 వేల 779 ఎకరాలకు గాను 6వేల 663 క్లైమ్ లు వచ్చాయని అన్నిటిని క్షుణంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రత్యేకంగా ఇవ్వబడిన యాప్ లో క్యాప్చర్ చేయాలని కలెక్టర్ సూచించారు.అటవీ హక్కుల చట్టానికి లోబడి ఎఫ్ఆర్సి కమిటీలు అర్హులైన పోడువ్యవసాయదారులందరికీ పట్టాలు అందించే విధంగా పారదర్శకంగా పనిచేయాలన్నారు.స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ మండల స్థాయి అధికారులకు పూర్తిగా సహకరించి పరిశీలన ప్రక్రియను నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎర్రయ్య,కొత్తగూడ తహసిల్దార్ నరేష్,గూడూరు డిప్యూటీ తహశీల్దార్ నాగరాజు,ఎంపీడీవోలు భారతి,విజయలక్ష్మి,ఎఫ్ ఆర్ ఓ లు వజహత్,బి సురేష్,స్థానిక ప్రజాప్రతినిధులు ఎఫ్ఆర్సి కమిటీలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area