పోడు భూముల విచారణ త్వరిత గతిన పూర్తి చేయాలి.
జిల్లా కలెక్టర్ గోపి
ఫోటో రైటప్: సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్..
వరంగల్ బ్యూరో: అక్టోబర్ 7 (జనం సాక్షి)
అటవీ భూముల దరఖాస్తులు పరిష్కారం ప్రత్యేక యాప్ ద్వారా పరిష్కరించాలని వరంగల్ జిల్లా
జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి అన్నారు.
శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లో ఫారెస్ట్ బెస్ట్ బీట్ ఆఫీసర్స్ మరియు రెవెన్యూ అధికారులతో , పంచాయితీ సెక్రటరీ లతో పోడు భూముల సమస్య పరిష్కరించుటకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా
జిల్లా కలెక్టర్ పాల్గొని పంచాయితీ సెక్రెటరిలనుద్దేశించి మాట్లాడుతూ , జిల్లా లోకైమ్స్ 7711 వచ్చాయని, వాటిని పరిష్కరించుటకు ఆర్ఓ ఎఫ్ ఆర్ చట్టం కింద ప్రత్యేక మొబైల్ యాప్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ యాప్ ను పంచాయితీ సెక్రెటరి ల మొబైల్ లో ఈ రోజు ఇన్స్టలేషన్ చేయించి ట్రయల్ రన్ ఏర్పాటు తో పాటు వారికి అవగాహన కల్పించారు.
అటవీ భూముల సమస్యలను పరిష్కరించుటకు సులభతరమైన ఈ యాప్ ను ఎలా ఉపయోగించాలో పవర్ ప్రజెంటేషన్ ద్వారా పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ యాప్ ప్రతి హ్యాబిటేషన్ వారీగా డేటా , ఫారెస్ట్ డేటా ఒక్కే లా ఉండాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ పంచాయితీ సెక్రటరీ లు కోఆర్డినేషన్ తో పనులు చూసుకోవాలని అన్నారు.
15 మందితో కూడిన FRC కమిటీ మెంబర్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని వారి
కో- ఆపరేషన్ తో ముందుకు వెళ్లాలని వారు అన్నారు. ఎఫ్ఆర్సి కమిటీ మెంబెర్స్ కి ఈ యాప్ గురించి పూర్తి వివరాల తో పాటు హ్యాబిటేషన్ వారిగా వివరాలు ఇవ్వాలని వారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు. రెండు రోజుల్లో యాక్షన్ ప్లాన్ తయారుచేసి సర్వే చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు.
ప్రతి హ్యాబిటేషన్ వారీగా మండల్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేసి ఫీల్డ్ విజిటింగ్ చేయాలని, వారిలో పోలీస్లు శాఖ వారు తప్పనిసరి అని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు.
ఈ ప్రక్రియ మొత్తం 20 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
చిన్న చిన్న క్లెయిమ్స్ ఎవైన ఉన్నట్లు ఐతే వాటిని ముందుగా తీసుకుని ప్రజలకు అర్ధం ఐయే విధంగా చెప్పాలని, ఎలాంటి అవాంతనీయ సంఘటనలు జరుగకుండా చూసుకోవలసిన భ్యధ్యత మండల లెవల్ కమిటి పైన ఉందని , ఏదైనా తప్పి దాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఐతే సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతందని వారు అన్నారు.
నెక్కొండ ఎంపీడీవో పరమపదించినందున వారి ఆత్మ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట అదనపు కలెక్టర్ ఎల్బీ హరి సింగ్ ఆర్డిఓ మహేందర్ జి డి ఆర్ డి ఓ సంపత్ రావు, సిపిఓ జీవరత్నం, డిటిడిఓ ఎస్.కె జహీరుద్దీన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు వివిధ మండలాల తాసిల్దారులు,ఎంపీడీఓ లు, ఎంపీలు , పంచాయతీ సెక్రెటరీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అధికారులు పాల్గొన్నారు.
Attachments area