పోడు భూముల సర్వేకి సంపూర్ణ సహకారం అందించాలి: జడ్పిటిసి
పినపాక నియోజకవర్గం అక్టోబర్ 08 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోడు భూముల సర్వే కార్యక్రమానికి అధికార యంత్రాంగానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని మణుగూరు జడ్పిటిసి పోశం నర్సింహారావు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు శనివారం పోడు భూముల సర్వే కార్యక్రమం మణుగూరు మండలం తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల తహసిల్దార్ నాగ రాజు తో కలిసి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పోడు భూముల సర్వే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని ఇందుకు పోడు రైతులు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గిరిజన ఆదివాసి ప్రజల పట్ల ప్రత్యేక అభిమానంతో అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకి పట్టాలను ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం గా ఆయన అభివర్ణించారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న సన్న చిన్న కారు ఆదివాసి గిరిజన ప్రజలకి ప్రభుత్వ నిర్ణయం సువర్ణ అవకాశం అని ఆయన అభివర్ణించారు సర్వే కార్యక్రమానికి సహకరించడం ద్వారా మీ భూములకి పట్టాలను ప్రభుత్వం మంజూరు చేయుటకు అధికార యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు ప్రభుత్వ నిర్ణయం లో ప్రధాన భూమిక పోషించిన ఎమ్మెల్యే రేగా కాంతారావుకు నియోజకవర్గ ప్రజల తరఫున పోశం నరసింహారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల తాసిల్దార్ నాగరాజు, తోగూడెం గ్రామ సర్పంచ్ బొగ్గం రజిత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ధనుంజయ పంచాయతీ కార్యదర్శి జె విజయ్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు తదితరులు పాల్గొన్నారు.