పోలవరంపై పు వ్వాడ వ్యాఖ్యలు ఆక్షేపణీయం

ముంపుతో పోలవరానికి సంబంధం లేదు
విలీన గ్రామాలతో పాటు ఎపిని తెలంగాణలో విలీనం చేయాలి
మంత్రి బొత్స సత్యానారాయణ వ్యాఖ్యలు

అమరావతి,జూలై19(జనం సాక్షి): పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడటాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. పువ్వాడ అజయ్‌ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన గ్రామాల ప్రజల కోసం ఏమి చేయాలో తమకు తెలుసునని స్పష్టం చేశారు. ’ఆయా గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే ఏపీని కూడా కలపాలని అడుగుతాం. ఏపీ ఆదాయం తగ్గింది ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా’ అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఇదిలావుంటే
పిల్లలను గ్లోబల్‌ స్టూడెంట్లుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం మన బడి `నాడు నేడు లో భాగంగా సత్యనారాయణపురం లోని ఓ ఉన్నత పాఠశాలలో 44 లక్షలతో అదనపు తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్‌ ధిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్‌ నియోజకవర్గంలోని 33కోట్లతో 28 ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ… సీఎం జగన్‌ చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు ఉండాలి. నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్నాం.మన బడి ` నాడు నేడు ద్వారా ఈ ఏడాది 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. నూతన విద్యా విధానం ద్వారా అంగన్వాడీల్లో 1,2 తరగతులు చెప్పే స్కూల్‌ టీచర్లు అందులో ఉంటారు. గతంలో ఒకే టీచర్‌ అన్ని స్జబెక్ట్‌లను బోధించేవారు. ఈ అకడమిక్‌ సంవత్సరం నుంచి మూడోతరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లు
అందుబాటులో ఉంటారు. పాఠశాలల్లో కొన్ని లోపాలను సరిదిద్దుతున్నాం.. భావి తరాలు మరింత అభివృద్ధి చెందాలి. పిల్లల చదువుల పట్ల రాజకీయాలు చేయడం మానుకోవాలి.. తల్లిదండ్రులు వారి ధ్యాసలో పడకుండా పిల్లల అభివృద్ధికి సహకరించాలి.కేరళ తరహాలో విద్యార్థులు ఉన్నత విద్యనందిపుచ్చుకొని రాణించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.