పోలవరం నిర్మిస్తే తెలంగాణ ఆదివాసులు

నిండా మునిగిపోతరు..
నష్ట నివారణ చర్యలపై సీఎం వివరణ ఇవ్వాలి..
టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం
ఖమ్మం, ఆగస్టు 18 (జనంసాక్షి) :
పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణలో అంతర్భాగమైన ఖమ్మం జిల్లాలోని అదివాసులు నిండా మునిగిపోతరని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఆయన శనివారం మీడియాలో సంభాషించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ పోలవరం నిర్మాణంతో ఖమ్మం జిల్లాలోని 434 గ్రామాలు ముంపునకు గురవుతాయని, వేల మంది ఆదివాసులు నిరాశ్రయులై రోడ్డున పడుతారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం అధిక లాభం సీమాంధ్రకు కలిగితే, అత్యధిక నష్టం తెలంగాణకు జరుగుతుందని వెల్లడించారు. అధికారంలో ఉన్న సీమాంధ్రకు మేలు చేయడానికి, తెలంగాణను దోచుకుంటున్నదని ఆయన ఆరోపించారు. పోలవరం నిర్మాణం విషయం ఇంకా సుప్రీం కోర్టులోనే ఉండగా, సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ప్రకటించడం అభ్యంతరకరమన్నారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేవలం సీమాంధ్రకే సీఎంలా వ్యవహరిస్తూ, తెలంగాణ ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. పోలవరం నిర్మించే పట్టుదలే ఉంటే, నష్టపోతున్న తెలంగాణ ఆదివాసులను ఆదుకోవడానికి తీసుకునే నష్ట నివారణ చర్యలను వెల్లడించాలని సీఎంను ఆయన డిమాండ్‌ చేశారు. లేకుంటే, ఖమ్మం జిల్లా ఆదివాసుల కోసం కూడా ఉద్యమాన్ని న వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు. మున్ముందు కూడా ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ ఖతమవడం ఖాయమని స్పష్టం చేశారు.డిపిస్తామని కోదండరాం హెచ్చరించారు. తెలంగాణపై తమ వైఖరిని నాన్చుతూ కాంగ్రెస్‌ నిర్లక్ష్యంగా