పోలాలవద్దకు వెళ్లే దారి కబ్జా
కరీంనగర్: గంగాధర మండలం తాడాజెర్రి గ్రామంలో వ్యవసాయ రైతులు పోలం వద్దకు వెళ్లే రహదారిని కబ్జా చేసి దున్నారని రైతులు ఈరోజు అధికారులకు ఫిర్యాదు చేశారు. రహదారి దున్నటంతో పంటపోలాల వద్దకు వెల్లటానికి ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహసీల్దారు హామీ ఇవ్వటంతో రైతులు వెనుతిరిగారు.