పోలీసులకు చిక్కిన గంజాయి స్మగ్లర్లు భారీగా గంజాయి స్వాధీనం
ఖానాపురం సెప్టెంబర్ 20జనం సాక్షి
ఒడిషా నుండి హైదరాబాద్ మీదుగా కర్ణాటక రాష్ట్రానికి గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 7 సభ్యుల ముఠాలో ఆరుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ మరియు ఖానాపూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి నుండి సుమారు ఒక కోటి పదిలక్షల విలువగల 550 కిలోల గంజాయితో పాటు ఒక వ్యాన్, కారు, ద్విచక్రవాహనం మరియు ఐదు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.*
*పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో 1. బానోత్ చందు, వయస్సు 38, మంగళవారిపేట గ్రామం, ఖానాపూర్ మండలం, వరంగల్ జిల్లా. 2. కన్నబోయిన దుర్గాప్రసాద్, వయస్సు 30, బూర్గంపహాడ్. 3. గులోత్ అనిల్, వయస్సు 20, గుబ్బాడి తండా, రాయపర్తి, వరంగల్ జిల్లా. 4. బానోత్ మహేందర్, వయస్సు 27, గుబ్బాడి తండా,
రాయపర్తి, వరంగల్ జిల్లా. 5.పిల్లలమర్రి శ్రీనివాసరావు, వయస్సు 39, బుర్గంపహాడ్, బద్రాద్రి కొత్తగూడ జిల్లా. 6. కత్తా చిన్నారెడ్డి, వయస్సు 36, మారెడిమిల్లి గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా, (అ.ప్ర) మరియు ప్రస్తుతం పరారీలో వున్న నిందితుడు రాయపర్తి కి చెందిన నరసింహరావు ఆలియాస్ రాజు ఉన్నారా.ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ ప్రస్తుతం పరారీలో వున్న నిందితుడు నర్సింహరావు మరో నిందితుడు కన్నబోయిన దుర్గాప్రసాద్ తో కల్సి గత నాలుగు
సంవత్సరాలుగా తనకు చెందిన వ్యాన్ మరియు కారులో ఒడిషా రాష్ట్రంలోని బలిమెల ప్రాంతం నుండి తక్కువ ధరకు గంజాయిని కోనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ ధరకు విక్రయించేవాడు. ఇదీ రీతిలో తనకు వచ్చిన అర్డర్ల దృష్టిలో వుంచుకోని ప్రధాన నిందితుడు నర్సింహరావు అదేశాల మేరకు మిగితా నిందితులు ఓడిషా రాష్ట్రంలో 550 కిలోల గంజాయిని కోనుగోలు చేసి వాటిన రెండు కిలోల చొప్పున ప్యాకింగ్ చేసి 275 ప్యాకేట్లను ఐచర్ వ్యాన్ లో రహస్యంగా భద్రపర్చి హైదరాబాద్ మీదుగా కర్ణాటక రాష్ట్రంలో విక్రయించేందుకు నిందితులు సోమవారం రోజు బలిమెల బయలుదేరారు. నిందితులు పోలీసులకు చిక్కకుండా వుండేందుకుగాను ముందుగా గంజాయి రవాణా చేస్తున్న వాహనానికి కొద్ది దూరంలో ముందుగా నిందితుల్లో కొందరు ఎస్కార్ట్ గా ద్విచక్రవాహనం, కారులో ప్రయాణిస్తూ పోలీసుల కదలికలను గమిస్తుండేవారు. నిందితులు బలిమెల నుండి చింతూరు, భద్రాద్రి కొత్తగూడ మహబూబాబాద్ మీదుగా గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో ఈ రోజు మధ్యాహ్నం టాస్క్ ఫోర్స్ మరియు ఖానాపూర్ పోలీసులు సంయుక్తంగా కలిసి బుధరావు పేట గ్రామ శివారులో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానంతో పోలీసులు ఐచర్ వ్యాన్ మరియు ద్విచక్రవాహనం, కారులో వస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు వ్యాన్ లో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లుగా అంగీకరించడంతో పోలీసులు వ్యాన్ ను తనీఖీ చేయగా రహస్యంగా భద్రపర్చిన గంజాయిని గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. – గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ఫో ర్స్ ఏసిపి జితేందర్ రెడ్డి,
టాస్క్ ఫోర్స్ ఇన్స్ స్పెక్టర్లు నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్.ఐ తిరుపతి, ఏఏ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, స్వర్ణలత, కానిస్టేబుళ్ళు సృజన్, శ్రవణ్ కుమార్, నాగరాజు, నవీన్, సురేష్, శ్యాంసుందర్, శ్రీధర్, శ్రీనులను పోలీస్ కమిషనర్ అభినందించారు.