పోలీస్‌లకు వైద్య పరీక్షలు
కరీంనగర్, సెప్టెంబర్ 8 (జనంసాక్షి):40 సంవత్సరాలు పైబడిన స్థూలకాయం ఉన్న కవిూషనరేట్ పరిధిలోని వివిద స్థాయిలకు చెందిన పోలీస్‌లకు శుక్రవారం నాడు మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి సౌజన్యంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈశిభిరాన్ని పోలీస్ కవిూషనర్ విబి కమలాసన్‌రెడ్డి ప్రారంభించారు. ఈసంద ర్బంగా కవిూషనర్ మాట్లాడుతూ పోలీస్‌లు ఆరోగ్య రక్షణకు ప్రాదాన్యమివ్వాలన్నారు. మానసిక ఓత్తిడిని అధిగమిస్తూ విధులను నిర్వహిం చేందుకు నడక యెగా ద్యానంలను దినచర్యలలో బాగంగా అలవర్చుకోవాలన్నారు. పోలీస్‌ల సంక్షేమానికి ప్రాదాన్యతనిస్తూ కార్యక్రమాల ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. షుగర్ బీపి లతోపాటు ఈసీజి రక్త పరీక్షలు లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు నిర్వహించారు. నివేదికల ఆదారంగా శనివారం నాడు అవగాహన కల్పించడంతోపాటు మందులను అందిస్తారు. కవిూషనరేట్ పరిధిలోని 250 మంది పోలీస్‌లు హాజరయ్యారు. స్తూలకాయం తగ్గించడంతోపాటు మానసిక ఓత్తిడిని అదిగమించేందుకు యోగా ద్యానం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ గంగాదర్, వైద్యులు పాల్గొన్నారు.
పోలీస్ కవిూషనర్‌కు సన్మానం
గణెళిష్ నవరాత్రులు బక్రీద్ పర్వదినం సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటలను చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీస్ బందో బస్తును ఏర్పాటు చేసి సఫలీకృతం అయినందుకు తెలంగాణా రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ సమితి నిర్వాహకులు శుక్రవారం నాడు కరీం నగర్ పోలీస్ కవిూషనర్ విబి కమలాసన్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. ప్రజలబద్రత కోసం చేపడుతున్న సంస్కరణలను కొనసాగించా లన్నారు. కార్యక్రమంలో సమితి అద్యక్షుడు నాగరాజు శివ అనిల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.