పోలీస్‌ తనిఖీల్లో వాహనాలు సీజ్‌

నిర్మల్‌,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లా  తానూర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవ పత్రాలు లేని 85 బైకులు. 8 ఆటోలు, ట్రాక్టర్‌, కారుతోపాటు భారీ మొత్తంలో విలువైన మద్యం, గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.