పోలీస్ ల ముందస్తు చర్యలు..

( ప్రత్యేక ప్రతినిధి / జనం సాక్షి )..
రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయంలో సజావుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ముందస్తు చర్యలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్‌ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) అధ్యక్షతన గురువారం రామగుండం కమిషనరేట్ లో పెద్దపల్లి డిసిపి గైక్వాడ్ వైబావ్ రఘునాథ్ ఐపిఎస్ , నిర్మల్ ఎస్పి ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ ఎస్పి సురేష్ కుమార్ ఐపిఎస్., జగిత్యాల్ ఎస్పి ఎ,భాస్కర్ , జయశంకర్ భూపాలపల్లి ఎస్పి పి.కర్ణాకర్ మరియు కరీంనగర్ రూరల్ ఏసీపీ టి. కర్ణాకర్ రావు లతో పాటు రామగుండము కమీషనరేట్ పరిదిలోని ఎసిపి, సిఐ, ఎస్ఐలతో అంతర్‌ జిల్లాల సరిహద్దు సమావేశం నిర్వహించడం జరిగింది.

ఇట్టి సమావేశం లో చర్చించిన విషయాలు

1) అంతర్ జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రాంతాలను గుర్తించడం పై సమీక్షా

2) సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలపై నిఘా, ఉమ్మడి కూంబింగ్ ఆపరేషన్, ఏరియా డామినేషన్స్ ,కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికలు.

3) ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఓటింగ్ సంబంధిత పరికరాల రవాణా మరియు బందోబస్తు ఏర్పాట్ల గురించి సమీక్షా (మంథని అసెంబ్లీ నియోజకవర్గం , ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం)

4) సరిహద్దు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు, మద్యం, ఆయుధాలు మరియు ఇతర అక్రమ రవాణాను నియంత్రించడానికి ఉమ్మడి కార్యకలాపాలు.

5) ఎన్నికల సంబంధిత పరస్పర సమాచార మార్పిడి.

6) NBWs అమలు పరుచుటలో యూనిట్ ల మధ్య పరస్పర సహకారం.

7) VVIPs/VIPల కదలికల సమయం లో పరస్పర సమాచార మార్పిడి మరియు బందోబస్తు ఏర్పాట్లలో సహకారం.

8) సరిహద్దు ప్రాంతాలలో గత ఎన్నికల సమయాలలో జరిగిన నేరాలు మరియు శాంతిభద్రతల సమస్యల పై సమీక్షా.

9) ఏదైనా శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే సరిహద్దు జిల్లాల మధ్య పోలీసు బలగాలను త్వరితగతిన సమీకరించడం కోసం రి ఇంఫోర్సేమేంట్ టీమ్స్ ఏర్పాటు పై సమీక్షా.

10) కమ్యూనికేషన్ లేని మారుమూల ప్రాంతాలను గుర్తించి పరస్పర సహకారం తో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం మరియు అట్టి ప్రాంతాలపై నిఘా

11) గత ఎన్నికల సమయం లో నేరాలకు పాల్పడిన వ్యక్తులను బైండొవర్ చేయడం లో సరిహద్దు జిల్లాల అధికారులు పరస్పర సహకారం ఉండాలన్నారు.

12) ఎన్నికల ముందు, ఎన్నికల సమయం లో నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న అనుమానితులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.

13) 80 సంవత్సరాల పైబడిన వృద్దులకు, మూడోవంతు అంగవైకల్యం ఉన్న వారికీ భారత ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం వారికీ ఓటు వేసే విధంగా ప్రత్యేక విభాగాల ఏర్పాటు….

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ఏజెన్సీ, సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో సరిహద్దు జిల్లాల పోలీసుల పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని నిర్ణయించారు.