పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ షార్ట్ ఫిల్మ్ పోటీలు

– జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఈ నెల 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం, 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జాతీయ ఐక్యత దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే పురస్కరించుకుని పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ ఈ నెల 21 నుండి 31 వరకు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగంగా జిల్లా పరిధిలోని విద్యార్థులు, యువత , ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్ కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పోటీలకు విద్యార్థులతో పాటు యువత , ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. ఫోటోగ్రఫీ, 3 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిమ్ ను ఈ నెల 24 లోపు జిల్లా పోలీసు కార్యాలయం నందు పోలీస్ పిఆర్ఓకు అందజేయాలన్నారు.రోడ్ ప్రమాదాలు , సైబర్ నేరాలు , ఈవ్ టీజింగ్ , ర్యాగింగ్ ,  కమ్యూనిటీ పోలీసింగ్, మూఢ నమ్మకాలు , ఇతర సామాజిక రుగ్మతలు , అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపైన షార్ట్ ఫిల్మ్  పెన్ డ్రైవ్ ను, 10×8 సైజ్ మూడు ఫోటోలను పోలీసు పిఆర్ఓకు అందజేయాలని అన్నారు.
Attachments area