పోలీస్ హెడ్ క్వాటర్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
• ప్రారంభించిన అదనపు డిసిపి ఆకుల శ్రీ రామ్ రెడ్డి
• నిజాంబాద్ బ్యూరో ,అక్టోబర్ 19( జనం సాక్షి ): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో భాగంగా శుక్రవారం పోలీస్ హెడ్క్వార్టర్స్ యందు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిజామాబాద్ అదనపు డిసిపి ఆకుల శ్రీ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 303 తుపాకి నుండి ఎల్ ఏం జి గన్ వరకు బీపీ జాకెట్లు వాడకం, టీయర్ గ్యాస్ వాడకం ,మైక్ సెట్ దాని పనితీరు ,నైట్ విజన్ డే డివిజన్, ఫింగర్ ప్రింట్లు, కమ్యూనికేషన్ ,డాగ్ స్క్వాడ్, మొదలగు వీటిని ఇలా ఉపయోగిస్తారు విద్యార్థులకు క్షుణ్నంగా వివరించాడం జరిగిందన్నారు.జిల్లాలో అమరవీరుల సంస్కరణ దినోత్సవం లు ఈ నెల 15నుండి21 వరకు సంస్కరణ దినములు నిర్వహిస్తున్నామన్నారు.ఇందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించాడం జరిగింది అన్నారు.ప్రతీ డివిసన్ లో కార్యక్రమలు నిర్వహిస్తున్న మన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శేఖర్,ఆర్ ఎస్ ఐ లు కృష్ణయ్య, విద్యాసాగర్, నిజామాబాద్ ఆర్ డి ఓ వెంకటేశ్వర్లు, వివిధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.