పోషకాహారం వ్యక్తిగత పరిశుభ్రత పై విద్యార్థుల కు అవగాహన
ఐ సీ డి ఎస్ సూపర్ వైసర్ శ్రీలత
ఖానాపూర్ రూరల్ 22 సెప్టెంబర్(జనం సాక్షి): పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత పై గురువారం బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐ సీ డి ఎస్ సూపర్ వైసర్ శ్రీలత విద్యార్థుల కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని అలాగే మనం తినే సమయంలో గాని చేతితో తీసుకునే ఆహారం ఏదైనా ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని ఆమె అన్నారు. మనం ధరించే బట్టలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె విద్యార్థుల ను కోరారు.ఈ సందర్భంగా విద్యార్థుల తో వ్యక్తిగత పరిశుభ్రత పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అంగన్వాడి టీచర్స్ పాల్గొన్నారు.