పోషకాహార మాసోత్సవాలు….

*పౌష్టికాహారం తీసుకోవాలి…
*రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి..

చిలప్ చెడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నరని తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలి ఆకుకూరలు తినాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని జగ్గంపేట్, గంగారం, అజ్జమర్రి, బండ పోతుగల్, ఫైజాబాద్, చిట్కుల్, చిలప్ చెడ్ గ్రామాలలో ఆసరా స్మార్ట్ కార్డ్ పింఛన్ కార్డులు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోషణ అభియాన్ పోషకాహార మహోత్సవాలు సందర్భంగా ఫైజాబాద్, చిట్కుల్, చిలప్ చెడ్ లో ఆకుకూరలు, పప్పులు, వివిధ రకాల ఆకుకూరలతో బతుకమ్మ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సునీత రెడ్డి మాట్లాడుతూ మహిళలు 65% రక్తహీనతో బాధపడుతున్నారన్నారు. 51 శాతం గర్భిణీలు బాధపడుతున్నారు. ముఖ్యంగా అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు ముర్రుపాలు తాగిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పిల్లలకు బాలామృతం అలాగే పోషకాలు తినిపించాలన్నారు.రెండుసంవత్సరాల వరకు కంటికి రెప్పలాగా కాపాడుకొని పౌష్టికాహారం ఇవాళ అన్నారు. మాత శిశు ఆస్పత్రిలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు లక్ష్మీ దుర్గారెడ్డి, నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, తాహాసిల్దార్ కమలాద్రి, ఎంపీడీవో శశి ప్రభ, మండలానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.