పోషణ్ పక్వాడ కార్యక్రమాలను విజయవంతం చేయాలి 

పోషణ్ పక్వాడ కార్యక్రమాలను విజయవంతం చేయాలి
ఎంపీపీ జ్యోతి\కొడకండ్ల, ఏప్రిల్03(జనం సాక్షి):ఎంపీడిఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పోషణ పక్వాడ సమావేశంలో ఎంపీపీ జ్యోతి మాట్లాడుతూ పోషణ లోపం లేకుండా ఉండేందుకు, ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని చేరే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని గ్రామాల్లో పోషణ లోపం లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రతిరోజు అంగన్వాడి సెంటర్లను సూపర్వైజర్లు సందర్శించాలన్నారు. డిడబ్ల్యుఓ జయంతి మాట్లాడుతూ మార్చి 20 నుండి ఏప్రిల్ 3 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పోషన్ పక్వాడ పై అవగాహన కల్పించేందుకు మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మిల్లెట్స్, పోషణ్ పక్వాడా పై వ్యాసరచన పోటీలు, టీ-3 ఎనిమియా (రక్తహీనత) పై స్త్రీలకు, చిన్న పిల్లలకు అవగాహన క్యాంపులు ఏర్పాటు,కాలేజీలలో వర్క్ షాపులు సెమినార్సు ఏర్పాటు, ఆరోగ్యం పై అవగాహన కోసం యోగా కార్యక్రమాలు,డిజిటల్ పోషణ్ పంచాయతీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మిల్లిట్స్ పై స్వయం సహాయక సంఘాలతో వర్క్ షాప్ ప్రమోషన్, మిల్లిట్స్ కుకింగ్ కాంపిటీషన్ (భర్తలతో) ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు దృష్ట్యా ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు, అందుకోసం మిల్లిట్స్ సామలు, కొర్రెలు, అరికెలు, జొన్నలు, సజ్జలు, రాగులు, కుసుమలు, అండు కొర్రలు, ఉదలు, తదితర పోషకాలు అధికంగా కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. సర్పంచ్ మధుసూదన్,ఈజీఎస్ డైరెక్టర్ అందె యాకయ్య మాట్లాడుతూ పోషక విలువలు కలిగిన చిరుధాన్యాల్లో ఎక్కువ శాతం విటమిన్స్ బి 12, బి17, బి6 పీచు పదార్థాలు కలిగి ఉంటాయి అన్నారు. మండలంలో అతి తీవ్ర లోప పోషణ, లోప పోషణ కలిగిన పిల్లలను గుర్తించి వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపి చికిత్స చేయించడం కోసం సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు కృషి చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యుల సమన్వయంతో పనిచేయాలన్నారు.అనంతరం కార్యక్రమంలో తహశీల్దార్ చంద్ర మోహన్, ఎంపీడిఓ సురేందర్ నాయక్, సూపర్ వైజర్స్ సరళ, ఏపీఓ కుమార స్వామి, శ్రీనివాస్, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్స్, రాజా శేఖర్, లక్ష్మి నారాయణ,  సోమయ్య మరియు ఐసిడిఎస్ టీచర్లు మహేముద, సరిత, ఉప్పలక్ష్మి వినోద, నరసమ్మ, మంజుల, మాధవి గర్భిణీ బాలింతలు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.