పోషణ మాసం కార్యక్రమం
మహా ముత్తారం సెప్టెంబర్26( జనం సాక్షి)అంగన్వాడి కేంద్రం లో పోషణ మేళ
వజినేపల్లి మరియు హుజూర్నగర్ అంగన్వాడీ మినీ అంగన్వాడీ కేంద్రంలో గ్రామ సర్పంచ్ గోక స్వర్ణలత గారి ఆధ్వర్యంలో పోషణ మేలా కార్యక్రమం అంగన్వాడి టీచర్లు ప్రమీల, రమా జరిపించడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో చిన్నారులకు రాగి జావా, రవ్వ లడ్డూలు, పాయసం, కోడిగుడ్లు, పులిహోర, బచ్చల ఆకు తదితర పదార్థాలను తయారు చేసి చిన్నారులకు గర్భవతులకు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ గారు మాట్లాడుతూ గర్భవతులు పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకుంటూ తగు జాగ్రత్తలు ఉండాలని తెలిపారు. అంగన్వాడి నుంచి వచ్చే వస్తువులు అందరికీ అందజేసి ఉన్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు తగిన పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు రోజు ఇవ్వాలని అంగన్వాడి టీచర్లకు తెలిపారు. అలాగే గర్భవతులు చిన్నారులు వ్యక్తిగత పరిశుభ్రత కచ్చితంగా పాటించాలని పాటించినట్లయితే ఎలాంటి రోగాలు మన దరికి చేరవని తెలిపారు. ప్రభుత్వం పెద్ద పిల్లలకైతే దసరా సెలవులు ప్రకటించినట్లు అంగన్వాడీ కేంద్రాలకు కూడా దసరా సెలవులు ప్రకటించాలని వారు కోరారు. ఎందుకంటే ఒక ఇంట్లో పెద్ద పిల్లలు బడికి పోకుండా చిన్న పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి రావాలంటే ఇంట్లో మారం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ప్రమీల,రమ, ఆశా వర్కర్ నిర్మల, ఆయా సుశీల, గర్భవతులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.