పోస్టాఫీసుల్లో.. గోల్డ్ కాయిన్స్‌పై రాయితీ
హైదరాబాద్, జనంసాక్షి: అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 13న పోస్టాఫీసుల్లో బంగారు కాయిన్లు చేసే వినియోగదారులకు 7.5 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఏపీ సర్కిల్ చీఫ్ మాస్టర్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు. పుష్య నక్షత్ర రోజులైన మే 15, 16 తేదీల్లో కూడా ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. అన్ని ప్రధాన తపాలా కార్యాలయాల్లో బంగారు కాయిన్లు అమ్మకానికి పెడుతున్నట్లు పేర్కొన్నారు. 24 క్యారెట్ల స్వచ్ఛత ఉన్న 0.5,1,5,8,10,20,50 గ్రాముల కాయిన్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.