పౌష్టికాహారంతో ఆరోగ్యం
తర్లుపాడు , జూలై 28 : మండల కేంద్రమైన తర్లుపాడు పంచాయితీ పరిధిలోని ముస్లిం వీధిలోని అంగన్‌వాడీ కేంద్రంలో మహిళా శిశు చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్‌వైజర్ ఎం లక్ష్మీదేవి హాజరై మాట్లాడుతూ స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబం అంతా చదువుకుంటారని, అప్పుడే మహిళలు చైతన్య వంతులు అవుతారని ఆమె తెలిపారు. గర్భవతులు, బాలింతలకు పోషకాహార పదార్థాలు సమయానికి తీసుకోవాలని అన్నారు. గృహ హింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, కిశోర బాలికల యొక్క వ్యక్తిగత పరిశుభ్రత, రక్తహీనత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గర్బిణీ స్త్రీలు, బాలింతలు, కిశోర బాలికలు, అంగన్‌వాడీ కార్యకర్త ఈర్ల నాసరమ్మ తదితరులుత పాల్గొన్నారు.