ప్రగతి పథంలో సుధా బ్యాంక్
సూర్యాపేట (జనంసాక్షి ):సుధా బ్యాంక్ వారి 2021- 22 వార్షిక సర్వసభ్య సమావేశంను శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బ్యాంకు చైర్మన్ మీలా మహదేవ్ అధ్యక్షత వహించగా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ వివిధ ఎజెండా అంశాలు చదివి వాటాదారులచే ఆమోదింపజేశారు. బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్ మాట్లాడుతూ,కరోనా మహమ్మారి ఎన్నో ఆర్థిక సంస్థలని అతలాకుతలం చేసినప్పటికీ,అందరి సహకారంతో సుధా బ్యాంక్ వరుసగా లాభాలను ఆర్జిస్తుందని చెప్పారు.సుధా బ్యాంక్ దాదాపుగా 15 ఏళ్ల నుండి 0 ఎన్ పిఏ నమోదు చేయటం బ్యాంకు యొక్క పనితీరుకు అద్దం పడుతుందన్నారు.బ్యాంక్ ఎండి పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ బ్యాంక్ రెండవ గ్రేడ్ బ్యాంకుగా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు నమోదు చేయటం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గర్వకారణమని తెలిపారు.ఈ సంవత్సరం ఒక కోటి మూడు లక్షల రూపాయలు లాభాలు అర్జించి బోర్డు అనుమతితో గత సంవత్సరం 15 శాతం, ఈ సంవత్సరం 15 శాతం డివిడెంట్ వాటాదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.అనంతరం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రాజా మాట్లాడుతూ సుధా బ్యాంక్ నిస్వార్ధంగా పనిచేస్తూ, ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో మేలైన సేవలందిస్తుందని చెప్పారు.ప్రముఖ న్యాయవాది నాతి సవేందర్ మాట్లాడుతూ సుధా బ్యాంక్ పనితీరు చాలా బాగుందని , సుధా బ్యాంక్ మరిన్ని ప్రజా ఉపయోగ కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.ప్రముఖ వ్యాపారస్తులు తోట శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం సుధా బ్యాంక్ తమ బ్రాంచ్ ల ద్వారా సేవలందించడం మనందరికీ గర్వకారణమన్నారు.ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు అనంతల ప్రభాకర్, కమలేకర్ శంకర్ లాల్ , ఏపూరి శ్రవణ్ కుమార్ , డాక్టర్ మీలా సందీప్, కక్కిరెని చంద్రశేఖర్, భూక్య సుజాత , మేనేజర్లు రవీందర్ రెడ్డి, సైదులు ,రామకృష్ణ ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.