.ప్రగ్యాసింగ్‌కు అనారోగ్యం ఉత్తిదే..


` క్రికెట్‌ ఆడటంపై పలువురి అనుమానాలు
భోపాల్‌,డిసెంబరు 26(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ భాజపా నాయకురాలు, భోపాల్‌ ఎంపీ ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. అనారోగ్య కారణాలు చూపి బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె తాజాగా క్రికెట్‌ ఆడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భోపాల్‌లోని శక్తినగర్‌ ప్రాంతంలో అనుచరులు ఉత్సాహపరుస్తుండగా ఆమె క్రికెట్‌ ఆడుతూ కనిపించారు. మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె అనారోగ్య కారణాలు చూపి 2017లో బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆమె వీల్‌ఛైర్‌పై దర్శనమిస్తున్నారు. ఆ మధ్య కబడ్డీ ఆడడం, నవరాత్రి ఉత్సవాల్లో గార్బా నృత్యం కూడా చేయడం చర్చనీయాంశమయ్యాయి. ప్రతిపక్షాలు ఆమెపై తీవ్ర విమర్శలు చేశాయి. ప్రగ్యాసింగ్‌కు వెన్నెముక సమస్య ఇప్పటికీ ఉందని, ఎప్పుడైనా అది తీవ్రంగా మారే అవకాశం ఉందని ఆమె సోదరి ఉప్మా ఠాకూర్‌ గతంలో ఓసారి చెప్పారు.