ప్రచారం చేస్తున్న టిఆర్ఎస్ నాయకులు
పట్టణంలో టిఆర్ఎస్ నాయకుల ముమ్మర ప్రచారం
రామకృష్ణాపూర్, నవంబర్ 11, (జనంసాక్షి) :
రామకృష్ణాపూర్ పట్టణంలోని జోడు పంపుల ఏరియాలోని జ్యోతినగర్‌లో టిఆర్ఎస్ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి చెందని తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఈ నాలుగేండ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేసి దేశంలోనే మొదటిస్థానంలో నిలిపాడని అన్నారు. ఆడపిల్లల కోసం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లాంటి పథం ప్రవేశ పెట్టి రాష్ట్రంలోని ఆడపిల్లలకు అండగా నిలిచాడని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలే కాకుండా రైతుబంథు, కంటి వెలుగు లాంటి పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేశారని అన్నారు. ఈ ప్రచారంలో జెడ్పీటిసి కంబగోని సుదర్శన్‌గౌడ్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, మాజీ సర్పంచ్ జాడి శ్రీనివాస్, మాజీ జెడ్పీటిసిలు యాకూబ్ అలీ, అయిల్ల రాజన్న, సీనియర్ నాయకులు బోయినపల్లి నర్సింగం, కె.సురేందర్, లక్ష్మీకాంత్, జె.మహేష్, జి.రవి కిరణ్, అజీజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.