ప్రచారం చేస్తున్న నడిపెల్లి దివాకర్‌రావు
మరోసారి అవకాశం ఇచ్చి గెలిపించండి… మరింత అభివృద్ధి చేస్తా
టిఆర్ఎస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 11, (జనంసాక్షి) :
మంచిర్యాల టిఆర్ఎస పార్టీ నుండి ఎమ్మెల్యేగా తనను మళ్ళీ ఆదరించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని టిఆర్ఎస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని 32వ వార్డులో ప్రజా ఆశీర్వాద యాత్రో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్‌రావుకు మహిళలు మంగళహారతులతో, వీర తిలకం దిద్ది వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గత నాలుగున్నరేండ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో, తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను వార్డుప్రజలకు వివరించారు. సంక్షేమ ఫలాలు రెట్టింపు కావాలంటే రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు, మంచిర్యాల అభ్యర్థిగా తనకు కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వసుంధ, వార్డు కౌన్సిలర్ జగన్మోహన్, ఇతర వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, టిఆర్ఎస్వి నాయకులు పాల్గొన్నారు.