ప్రచార రథం ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ దాసరి రాజలింగు

జనంసాక్షి , కమాన్ పూర్, అక్టోబర్ 05: పత్తి విక్రయించే సమయంలో రైతులు పాటించాల్సిన నియమాలు, నిబంధనలపై అవగాహన కల్పించెందు కోసం శుక్రవారం ప్రచార రథాన్ని కమాన్ పూర్ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు పచ్చ జెండా ఊపి ఏ.ఎం.సీ చైర్మన్ దాసరి రాజలింగు ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఈ ప్రచార రథం కమాన్ మార్కెట్ కమిటి పరిధిలో గల కమాన్ పూర్, రామగిరి, ముత్తారం మండలాల్లోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తుందన్నారు. రైతులు సీ.సీ.ఐ కేంద్రాల్లో పత్తి విక్రయించే రైతులు పాటించాల్సిన నియమ, నిబంధనల పై ప్రచారం చేస్తూ అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పత్తి రైతులు ఆధార్ కార్డు ను వేలిముద్ర ద్వారా, ముఖం ద్వారా, కంటి ద్వారా కానీ ప్రారమానికరణ చేయించుకోవాలన్నారు. ఆధార్ కార్డు ప్రామాణికరణ వాడుకలో ఉన్నా సెల్ నెంబర్ కు, బ్యాంక్ ఖాతా నెంబర్ కు ఫోన్ నెంబర్ ను లింకు చేసుకోవాలని సూచించారు. భూమి పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం,లింక్ కలిగిన నెంబర్ గల సెల్ ఫోన్ ను సీ.సీ.ఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందాన్నారు. ఈ నిబంధనలు పాటించిన వారి వద్ద నుండే పత్తి కొనుగోళ్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, బీ.ఆర్.ఎస్ నాయకులు సాన సురేష్, తోట రాజ్ కుమార్, జనగామ తిరుపతి, మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.