ప్రజలకు అందుబాటులో ఉంటా: సుంకె రవి
కరీంనగర్,నవబంర్28(జనంసాక్షి): ప్రజలకు ఏ ఆపద వచ్చి నా అందుబాటులో ఉంటానని చొప్పదండి టిఆర్‌ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ అన్నారు. తాను నియోజకవర్గంలోని గంగాధర మండలం బూ ర్గుపల్లిలో నివసిస్తాననీ, తనను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కారు గుర్తుకే ఓటేసి నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సుంకె రవిశంకర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సుంకె రవిశంకర్ ఒక ప్రైవేట్ పాఠశాలను జీవనోపాధి కోసం నిర్వహిస్తూ ఉద్యమ సమయంలో పాఠశాలల సంఘాలన్నింటిని ఐక్యం చేసి సకల జనుల సమ్మెలో పాల్గొనేలా కీలకపాత్ర పోషించారన్నారు. రాబోయే ఎన్నికల్లో సుంకె రవిశంకర్‌కే ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని టిఆర్‌ఎస్ నేతలు కోరారు. ఇంటింటా తిరుగు తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరి ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.