ప్రజలతో స్నేహంగా మెలిగేందుకే డయల్ 100: డీజీపీ
హైదరాబాద్, జనంసాక్షి : పోలీసులు, ప్రజల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తున్నామని డీజీపీ దినేశ్‌రెడ్డి చెప్పారు. డీజీపీ కార్యాలయంలో దినేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలతో మరింత స్నేహంగా మెలిగేందుకే ‘డయల్ 100’ ప్రారంభించామని వెల్లడించారు. సాయం కావాలని ఎక్కుడ నుంచి ఫోన్ చేసినా .. 40 సెకన్లలో స్థానిక పోలీసులను అప్రమత్తం చేస్తామని వివరించారు. డయల్ 100 ద్వారా ప్రతికాల్‌ను పర్యవేక్షించేందుకు వీలవుతుందని చెప్పారు.