“ప్రజలను చైతన్యం చేయడం కోసమే పాట”
మిత్రా బృందం ఆధ్వర్యంలో వీడియో సీడీ ఆవిష్కరణ
చేర్యాల (జనంసాక్షి) జూన్ 15 : ప్రజలను చైతన్యం చేయడం కోసమే వీడియో చిత్రీకరించామని మిత్రా టీవీ బృందం సభ్యులు పేర్కొన్నారు. బుధవారం ఆకునూరు గ్రామంలో ఖచ్చిరు వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎట్లుండెరా పల్లె, ఎట్లుండెరా ఎనుకాటి నా పల్లె ఎట్లుండెరా అనే పాటకు సంబంధించిన వీడియో సీడీని గ్రామ సర్పంచ్ చీపురు రేఖా-మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ బోయిని పద్మా-బాలయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ కొమ్ము రవి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, టీఆర్ఎస్ చేర్యాల మండల ఉపాధ్యక్షులు బోయిని రాజు లు హాజరై ఆవిష్కరించారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. గ్రామంలో నాటి రాజకీయ పరిస్థితులు, సాంస్కృతీ, సంప్రదాయం, ఆచారాలను గుర్తు చేసుకుంటూ నేటి యువత చేడు అలవాట్లకు బానిస కాకుండా సన్మార్గంలో నడుస్తూ సామాజిక సేవతో పాటు అన్ని రంగాల్లో ఎదగాలన్నారు. నిజాం రజాకార్ల వ్యతిరేక పోరాటం నుండి నేటి వరకు భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థను రూపుమాపి పౌరుషంతో ఎదిరించే గడ్డ ఆకునూర్ అని వారు అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జెండాలు ఎజెండాలు పక్కనపెట్టి గ్రామాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ప్రజలను చైతన్యం చేయడం కోసం ఇలాంటి మరెన్నో చిత్రాలు తీసి ప్రజల మన్ననలు పొంది మిత్రా టీవీ మరింత ప్రజాదరణ పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ స్వర్గం ఉపేందర్, పుల్లని వేణు నటీనటులు సుజాత, రేణుక, అన్నపూర్ణ,మౌనిక, బక్కోని రాజు, రణం వెంకటేశ్వర్లు గౌడ్, ఉడుత అయిలయ్య, కోయినేని నర్సయ్య గ్రామస్తులు మంతపూరి వెంకన్న, రణం ప్రశాంత్, తోర్నాల (తుంగ) పర్శరాములు, పోరండ్ల వెంకటేశ్వర్లు, తోళ్ల సత్యం, సుంకరి బాపురాజు, కె. నరహరిశర్మ, శిగుళ్ల కొమురయ్య, సందిటి చంద్రారెడ్డి మిత్రా యూనిట్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.