ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి -బెల్లంపల్లి ఎసిపి పి.సదయ్య

రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి ఎసిపి పి.సదయ్య అన్నారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాలయం చౌరస్తా నుండి బిజోన్ రాజీవ్ చౌక్ వరకు పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎసిపి సదయ్య మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ ఉన్నందున 144 సెక్షన్ అమలులో ఉందని, రాజకీయ పార్టీల నాయకులు ప్రచారాలు నిర్వహిస్తున్న సమయంలో తప్పని సరిగా పోలీసు వారి నుండి అనుమతి పొందాలని సూచించారు. విద్వేషాలు రచ్చకొట్టే విధంగా ప్రచారాలు ఉండవద్దని హెచ్చరించారు. ఎన్నికలు ప్రగడ్బందీగా నిర్వహించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని, అలాగే పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును ఏర్పాటు చేస్తామని, పట్టణంలో అనుమానితులు ఎవరైనా ఉన్న ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సిఐ మహేందర్ రెడ్డి, రామకృష్ణాపూర్, మందమర్రి, కాసిపేట, దేవాపూర్ ఎస్సై లు రాజశేఖర్, హరిశేకర్, ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది, పారా మిలటరీ బలగాల సిబ్బంది పాల్గొన్నారు.