ప్రజల్లో వ్యతిరేకతను పట్టించుకోని నేత
గత ఎన్నికల ముందు గుజరాత్ ఫార్ములా అంటూ నరేంద్రమోడీ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆయనే ఈ దేశానికి సరైన నాయకుడని భావించారు. బిజెపి నేతలు కూడా అద్వానీ లాంటి సీనియర్ల మనోభావాలను తెలుసుకోకుండా, ఆయనతో సంప్రదించకుండా మోడీని తెరపైకి తెప్పించారు. నిజానికి నరేంద్ర మోదీకి లభించినంతటి అద్భుత అవకాశం ఈ దేశంలో మరెవరికీ దక్కలేదు. దేశ ప్రజలంతా ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దేశం దశాదిశా మారుస్తారని నమ్మకం పెట్టుకున్నారు. నాలుగేళ్లు గడిచేసరికి ప్రజల్లో భ్రమలు తొలగిపోవడం మొదలయ్యింది. ఆయనవల్ల దేశానికి లాభం మాట దేవుడెరుగు..ప్రజలకు భారంగా మారాన్నడ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఆయన తనపై వస్తున్న విమర్శలపై ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు.అనేకానాఏక సమస్యలు ఎలాగూ ఉన్నాయి. కనీసం విభజన సమస్యలను కూడా పట్టించుకోవడం లేదు. ఇలా చేయడం ద్వారా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని మోడీ చూస్తున్నట్లుగా ఉంది. అందుకే కేంద్రం నుంచి పెద్దగా సాయం అందకుండా నాలుగేళ్లుగా తాత్సారం చేస్తున్నారు. అంతేనా అంటే అసలు పట్టించుకోవడం మానేశారు. ఎపికి ప్రత్యేక¬దా ఆందోళనలు ఇంకా కొనసాగుతున్న తరుణంలో, ¬దా సాధ్యం కాదంటున్న కేంద్రం కనీసం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్దత కల్పించక పోవడం దారుణం కాక మరోటి కాదు. పునర్వవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన అంశాలన్నింటినీ ఒక చోటకు చేర్చి అదే ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. రాష్ట్ర విభజన వేళ పార్లమెంట్ వేదికగా, ఎన్నికల సమయంలో ప్రజల సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక ¬దా హావిూని అమలు చేయాలని నవ్యాంధ్ర ప్రజానీకం గొంతెత్తుతుండగా ¬దాకు బదులు ప్యాకేజీని కేంద్రం తెరపైకి తెచ్చింది. అలాంటి ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తున్నారని ప్రకటించి దానిని కూడా చాపచుట్టేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. ఇరు రాష్ట్రాల్లో కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడ్డా, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కొత్తగా అధికారం చేపట్టినా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఎక్కడి గొంగళి అక్కడే అన్నచందంగా ప్రభుత్వాల పనితీరు ఉంది. ప్రధానంగా ఉద్యోగుల విభజన జరగలేదు. కార్యాలయాల విభజన పూర్తి కాలేదు. నీటి పంపకాలు చేయడం లేదు. వివిధ సంస్థల విభజన చేయడం లేదు. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. అయిన ఆ సమస్యలపై మోడీ ప్రభుత్వం చిత్తశుద్ది ప్రదర్శించడం లేదు. అంటే మొత్తంగా విభజన సమస్యలపై కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో ఓ రకంగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడిగా విఫలమయ్యాయనే చెప్పాలి. ఎపికి ప్యాకేజీ ప్రకటించగా ఇప్పటికి చట్టబద్ధత ఎజెండాలోకి ఎక్కలేదు. ఇటీవల అరుణ్‌జైట్లీ మాత్రం రీఆర్గనైజేషన్ యాక్టులో ఉన్న వాటికి మళ్లీ చట్టం చేయడం దేనికి అన్న వ్యాఖ్య చేశారు. అలాంటప్పుడు విభజన చట్టంలో లేని ప్యాకేజీకి చట్టం చేయరా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ¬దా వల్ల ప్రతి ఏటా ఏపీకి ఒనగూడే 3,500 కోట్ల ఆదాయాన్ని విదేశీ సంస్థల నుంచి అప్పుగా ఇప్పించి, తిరిగి ఆ మొత్తాన్నీ కేంద్రం చెల్లించే ఏర్పాటుకే చట్టబద్ధత అని సూత్రీకరించారు. ¬దా వల్ల ఐదేళ్లకూ కలిగే ఆర్థిక ప్రయోజనం ఏ ప్రాతిపదికపై కేంద్రం ఈ లెక్క వేసిందన్నది అర్థం కావడం లేదు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు సర్కారు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో విధిలేక ఆయన ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చి పోరుబాట పట్టారు. అలాగే అనేక అంశాలపైనా కేంద్రం తాత్సారం చేయడం లేదా దాటవేయడం సాగుతూనే ఉంది. విభజన సమస్యల విషయంలో ఇంత నిర్లిప్తంగా కేంద్రం ఉంటూ అనవసపర విషయాలపై ప్రచార ఆర్భాటాలు చేస్తోంది.
14వ ఆర్థిక సంఘం ¬దా ఇవ్వవద్దందని అబద్ధం ఆడారు. ¬దాతో సమకూరే ప్రయోజనాలన్నింటినీ ప్యాకేజీతో పూరిస్తామంటూ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను మరోసారి అప్పజెప్పారు. నిజంగానే ప్రతిపాదిత ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే ఉద్దేశం కేంద్రానికి ఉంటే ఇంతగా సాగదీత ఎందుకన్నది అర్థంకావడం లేదు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ తరవాత పరిణామాలు చూస్తే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనకాలకే కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోంది. మొత్తంగా విభజన సమస్యలు అలానే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పాలకులు సహించడం లేదు. అణచివేతతో అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇలా చేయడం వల్ల మరింతగా అసంతృప్తి పెరగుతుందే తప్ప తరగదని గ్రహించాలి. మనం ప్రజాస్వామ్య వ్యవస్తలో ఉన్నామని, నిరంకుశ దేశంలో కాదని గమనించాలి. కేంద్ర రాష్ట్రాలు ప్రజల ఆకాంక్షలను మరవకుండా జాగ్రత్త పడాలి. ఏపీకి అన్యాయం జరిగిందని ప్రధానమంత్రి మోడీ స్వయంగా ఒప్పుకొన్నప్పుడు న్యాయం చేయవలసింది కూడా ఆయనే అయినా అలా చేయడం లేదు. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం కార్యక్రమాలు చేప్టటడం ఎంతవరకు సబబు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరిస్తే నష్టపోయే ప్రజలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? న్యాయం చేయమని ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు వీధుల్లో, ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన ప్రదర్శనలు చేసినా పట్టించుకోకపోతే దేశ సమగ్రత నిలబడుతుందా? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉంటుందా? మొన్న ఏపీకి జరిగిన అన్యాయం రేపు మరొకరికి జరగదని గ్యారంటీ ఏమిటి? ఈ ధోరణి వల్ల యూనియన్ ప్రభుత్వంపై ప్రజలు ధిక్కారస్వరం వినిపిస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇదే ఇప్పుడు కెసిఆర్‌ను కదిలించి ఉంటుంది. సమస్య ఏదైనా నిర్లక్ష్యధోరణిని కేంద్రం అనుసరిస్తోంది. అందుకే అన్ని రాష్ట్రాల్లో మోడీపై వ్యతిరేకత పెరుగుతోంది.