ప్రజల నుండి వచ్చిన ప్రజా పిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 26 (జనం సాక్షి);
ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ గా ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలనీ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు లో నిర్వహించిన ప్రజవాన్ని కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష తో కలిసి ప్రజా పిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి తమ సమస్యలను తెలుపుతూ ప్రజలు సమర్పించిన పిర్యాదులను జిల్లా అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దరఖాస్తుదారులు సమర్పించిన దరకాస్తులను పరిశీలించి సంబంధిత శాఖ అధికారికి అందజేస్తూ వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఈరోజు 72 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో అధికంగా ధరణి కి సంబందినవి, ఆసరా పెన్షన్ల మంజూరి కై దరకాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. భూమి ఎక్సెస్ ఉన్న సర్వే నెంబర్లను పరిశీలించి రిపోర్ట్ పంపించాలని సంబందిత తహసిల్దార్లకు సూచించారు. గద్వాల మండలం జయలక్ష్మి అనే వికలాంగురాలు వారికీ ఇల్లు లేదని, పెన్షన్ రాలేదని దరకాస్తు చేయగా , పరిశీలించి సంబందిత అధికారికి అందజేశారు.ఎవరైతే సదరం సర్టిఫికెట్ కావాలని వచ్చారో అదే రోజు సదరం సర్టిఫికేట్లు జారి చేయాలనీ సంబందిత అధికారికి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, ఆర్ డి ఓ రాములు, ఏ ఓ యాదగిరి, జిల్లా అధికారులు,
సూపరిండెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.