ప్రజల పక్షాన నిలబడడం అభినందనీయం.
తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షులు జూకంటి జగన్నాథం.
సిరిసిల్లలో ధర్పల్లి సాయి కుమార్ కవిత్వం, ఛాయాచిత్రాల ప్రదర్శన.
రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 25 (జనం సాక్షి). ప్రజల పక్షాన నిలబడి కవిత్వం చిత్రకళ ఛాయాచిత్రాలు రూపొందించడం అభినందనీయమని తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం అన్నారు. గురువారం కార్మిక భవన్ ముగ్దం మోయినొద్దిన్ హాల్లో యువ కవి చిత్రకారుడు పాటల రచయిత ధర్పల్లి సాయికుమార్ కవిత్వం చాయాచిత్రాల ప్రదర్శనను తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు. చాయ చిత్రాల ప్రదర్శన సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు ప్రారంభించారు. గ్రామీణ చేతివృత్తులు , కళలపై రూపొందించన ప్రదర్శనను చేనేత కవి అడెపు లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జూకంటి జగన్నాథం మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాలకుల వైపు నిలబడి రాసేవాళ్ళు చాలామంది ఉన్నారని అన్నారు. ప్రజల వైపు నుండి రాసేవాళ్ళు తక్కువగా ఉన్నారని సాయికుమార్ ప్రజల వైపున నిలబడడం అభినందనీయమని తెలిపారు. అలిశెట్టి ప్రభాకర్ శైలిలో కవిత్వం రాస్తూ చిత్రాలను గీస్తూ ప్రజాసాహిత్యంలో తనదైన ముద్ర వేస్తున్నారని అన్నారు. తెలంగాణ గ్రామీణ జీవనంలో భాగమైన వృత్తులు, కళాకారుల జీవన నేపథ్యాన్ని ఆవిష్కరించిన తీరు సాయికుమార్ ప్రతిభను తెలుపుతుందని అన్నారు. ఇలాంటి ప్రదర్శనలు విరిగిరిగా జరగవలసి ఉందినీ వర్తమాన సమాజంలో ప్రజల కష్టాలు తన కళారూపాల ద్వారా ఆవిష్కరిస్తున్న సాయికుమార్ ను అభినందించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటీ వేణుమాట్లాడు సిరిసిల్ల జగిత్యాల పోరాటాల నేపథ్యం అలిశెట్టి ప్రభాకర్ లాంటి కవులను రూపొందించిందని అదే సామాజిక నేపథ్యాల నుంచి సాయికుమార్ తన కళ సాహిత్య ప్రస్తానాన్ని కొనసాగించడం మంచి విషయమని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పంతం రవి,బుర శ్రీనివాస్, పాటలు రచయిత గాయకుడు అందరూ వెంగలి నాగరాజు, వెంగళ లక్ష్మణ్, నూకల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు