ప్రజాధరణలో ‘టాప్ ముగ్గురు’ మంత్రులు
` కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి లకు అత్యధిక జనాధరణ
` అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడం, హైదరాబాద్ రూపురేఖలు మార్చడం కేటీఆర్ విజయం
` ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలికసౌకర్యాలు మెరుగుపరచడం హరీశ్‌రావు బలం
` 2014లో ఓడిపోయినా ‘వనపర్తి’ని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్న నియోజకవర్గ ప్రజలు
` మంత్రుల పనితీరుపై ‘జనంసాక్షి’ సర్వేలో వెల్లడైన ప్రజాభిప్రాయం
హైదరాబాద్ (జనంసాక్షి): ఖచ్చితమైన ప్రజాభిప్రాయం వెల్లడిరచడంలో ఎప్పుడూ ముందుండే ‘జనంసాక్షి’ మరోసారి మంత్రుల పనితీరు పట్ల రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన సర్వే నిర్వహించింది. సర్వేలో పరిశ్రమలు, సమాచార సాంకేతిక(ఐటీ) శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మొదటి స్థానంలో ఉండగా ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రెండో స్థానంలో ఉన్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని మారుమూల పల్లెల నుండి అంతర్జాతీయ వేదికల వరకు తనదైన శైలిలో వ్యవహరిస్తూ ప్రజల మనసులు చూరగొనడంలో ముందున్నారు. నియోజకవర్గంలో యాభై ఏళ్లలో జరగని అభివృద్ధిని మంత్రి కెటిఆర్ తన సామర్థ్యంతో కేవలం పదేళ్లలో చేసి చూపించారని ప్రజలు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు అరికట్టడంలో ప్రధాన భూమిక కెటిఆర్ దే అని అంటున్నారు. కేవలం తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాకుండా పలు అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని విదేశీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో ముందున్నారు. ఈ నేపథ్యములోనే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడులను సామాన్యప్రజలు సైతం ఉదహరిస్తున్నారు. మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా కెటిఆర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రజలతో పాటు అధికారులు కూడా పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి వస్తున్న స్వచ్ఛ అవార్డులే అందుకు ఉదాహరణ అంటున్నారు. చారిత్రక కట్టడాలను కాపాడుతూనే నగరం రూపురేఖలు మార్చుతున్న మంత్రి కెటిఆర్ హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దటంలో కూడా విజయం సాధిస్తారని రాష్ట్రప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. మొత్తం విూద ‘జనంసాక్షి’ సర్వేలో మంత్రి కెటిఆర్ పనితీరు పట్ల ప్రజలు 99 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పనితీరు పట్ల ప్రజలు 97 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక వసతులు, సిబ్బంది పనితీరు మెరుగుపరచడంలో విశేషకృషి చేస్తున్నారని ప్రజలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మాతాశిశు సంరక్షణ కేంద్రాలు, కంటివెలుగు పథకం నిర్వహణ తీరుపట్ల ప్రసంశలు వినిపించాయి. విశేషంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ప్రజల దృష్టిలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇప్పటికీ హరీష్ రావు పేరే వినపడటం. రాత్రులలో నిద్రచేస్తూ కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల వద్ద పనుల పురోగతిని సవిూక్షించిన విషయాన్ని ప్రజలు ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు. ఇక ‘జనంసాక్షి’ సర్వేలో 95.5 శాతం ప్రజామోదంతో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. 2014 లో స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లిన ఘనత మంత్రి నిరంజన్ రెడ్డిదేనని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి విషయంలో విశేషంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే తనకు సంబంధం లేని నీళ్ల శాఖ పేరుతొ సాధారణ ప్రజలలో గుర్తింపు పొందటం. ‘నీళ్ల మంత్రి నిరంజన్ రెడ్డి’ అంటూ పేరు తెచ్చుకోవడం చూస్తుంటేనే సాగునీటి రంగంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఏ స్థాయిలో నిలిపారు అనేది స్పష్టం అవుతుంది. అలాగే రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను విజయవంతంగా అమలు పరుస్తూ వ్యవసాయ శాఖకు వన్నె తెస్తున్నారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేరు గడిస్తున్నారని ప్రజలు అభిప్రాయపడ్డారు. ’జనంసాక్షి’ సర్వేల పట్ల ప్రజలలో ఉన్న ఆసక్తి మేరకు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయం సేకరించి ఏ రాజకీయపార్టీకి ఎంత ప్రజాధారణ ఉన్నదనే విషయాన్ని త్వరలోనే విూ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది విూ ‘జనంసాక్షి’.