ప్రజాప్రభుత్వాన్ని ఎలా రద్దు చేస్తారు!?
– ఓట్లేసిన ప్రజల హృదయాలు గాయపడుతాయి
– ఉత్తరాఖండ్ రాష్ట్రపతి పాలన చెల్లదు
డెహ్రాడూన్,ఏప్రిల్ 21(జనంసాక్షి):ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను హైకోర్టు నిలిపివేసింది. సంతో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ హరీశ్‌రావత్ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయన్ని తప్పుబట్టిన చీఫ్ జస్టిస్ కె.జోసెఫ్, జస్టిస్ వి.కె.బిష్త్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్రపతి పాలనను నిలిపివేస్తూ మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 29న బలపరీక్ష నిర్వహించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో కేంద్రం ఆత్మరక్షణలో పడ్డట్లు అయ్యింది. కేంద్రం తీరుపై ఉత్తరాఖండ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి పాలన విధించడంపై బుధవారం హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సవిూక్షకు లోబడనిది ఏదీ ఉండదు. మేమిక్కడ రాష్ట్రపతి రాజకీయ వివేకాన్ని విచారించేందుకు కూర్చోలేదు. ఎవరైనా తప్పు చేయొచ్చు. రాష్ట్రపతి.. లేదా న్యాయమూర్తి ప్రశస్తమైన వ్యక్తులు కావచ్చు. కానీ, ఆయన (రాష్ట్రపతి) కూడా ఘోరంగా తప్పు చేయవచ్చు. ఇక్కడ రాజులు, నిరంకుశాధికారం ఉండవు. విూరెంత గొప్ప అయినా.. న్యాయం విూ కన్నా గొప్పది అని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ఏప్రిల్ 29న బలినిరూపణకు హరీష్‌రావత్‌కు అవకాశం ఇస్తూ తీర్పునిచ్చింది. రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం దాన్ని ఎత్తివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమైనది. దేశంలోనే తొలి తీర్పుగా న్యాయనిపుణులు భావిస్తున్నారు.




