ప్రజాసమస్యలు పరిష్కరించే నాధుడే కరవు

నిజామాబాద్‌, నవంబర్‌ 6 : రాష్ట్రంలో ప్రజా సమస్యలు తాండవిస్తున్న, పరిష్కరించే నాధుడే కరువయ్యారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌.వీరయ్య పేర్కొన్నారు. సిపిఎం కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పట్టిం చుకోవడంలో అధికార, ప్రతిపక్షాలు పూర్తిగా విఫలం అయ్యాయని అన్నా రు. ప్రజా సమస్యల సాధనకోసం డిసెంబర్‌ నెలలో పక్షం రోజులపాటు వామపక్ష పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాయని చెప్పారు. ప్రభుత్వం స్పందించకుంటే నిద్రపోతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని నిద్ర లేపడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతనాలు కరువై య్యాయని, భారీ నీటి పారుదల ప్రాజె క్టులకు ప్రాధాన్యత కల్పించాలని, ఇంది రమ్మ ఇండ్లను పూర్తిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అమలు చేసి మైనార్టీలకు, వృత్తి దారులకు చట్టాన్ని అమలు చేయాలన్నారు. మద్యాహ్న భోజనం, సాంఘీక సంక్షేమ హాస్టల్స్‌, అంగన్‌వాడీ సెంటర్లకు సబ్సిడీమీద గ్యాస్‌ను సరఫరా చేయాలన్నారు. ఎఫ్‌ డిఐలను కాంగ్రేసేతర ప్రభుత్వాలు అమలు చేయమని ప్రకటించాయని, ఎపి ప్రభుత్వం కూడా చిల్లర వ్యాపా రంలో ఎఫ్‌డిఐలను అమలు చేయవద్ద ని ఆయన డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పనులలో బకాయిలను కూలీల కు చెల్లించాలన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో పత్తి రైతులకు కనీస మద్దతు ధర 4000రూపాయలు కల్పించాల ని, దళారులు మాత్రం రూ.2600 అందిస్తున్నాయని అన్నారు. చెరుకు కనీస మద్ధతు ధర రూ.3000వేలు అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పించాలని అన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కూల్చీవేతలో మట్టిని పొల్లాల్లో పోస్తున్నారని, దానివల్ల పంట నష్టం వాటిల్లుతుందన్నారు.