ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనది ఓటుహక్కే – మంథని ఆర్డిఓ హనుమాన్ నాయక్
మంథని, (జనంసాక్షి) : ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనది ఓటు హక్కు అని జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, మంథని రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ హనుమా నాయక్ లు పేర్కొన్నారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి ముజిమ్మిల్లా ఖాన్ ఆదేశాల మేరకు మంథని పట్టణంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ లు, అన్ని విభాగాల అధికారులు కలసి ఓటర్ అవగాహన కోసం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, మంథని రిటర్నింగ్ అధికారి హనుమా నాయక్ ఓటు హక్కు గల ప్రాధాన్యతను వివరించారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన ఓటు హక్కును బాధ్యతాయుతంగా నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సతీష్, మంథని తాసిల్దార్ రాజయ్య, మీడియా సెల్ నోడల్ అధికారి తూము రవీందర్, నాయబ్ తాసిల్దార్ గిరిప్రసాద్, మంథని ఎంపీడీవో రమేష్, మంథని ఎస్సైలు కిరణ్ కుమార్, రాణి వర్మ, సంక్షేమ శాఖ సూపర్డెంట్ కొట్టే రాజయ్య, రెవెన్యూ అధికారులు రాజిరెడ్డి, త్రివేణి, పోలీస్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, సంక్షేమ శాఖ సిబ్బంది, జూనియర్ కళాశాల సిబ్బంది, బూతు లెవెల్ ఆఫీసర్లు, ఐసిడిఎస్ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు