ప్రజా విజ్ఞప్తులను పరిష్కరిస్తాం -కలెక్టర్ శశాంక

 

 

 

 

 

 

 

మహబూబాబాద్ బ్యూరో-డిసెంబర్ 12(జనంసాక్షి)ప్రజల అందజేసిన విజ్ఞప్తులను సంబంధిత అధికారులకు పంపి సమస్యలను పరిష్కరిస్థామని జిల్లా కలెక్టర్ శశాంక తెలియజేశారు. సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలు విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా నర్సింహంలో పేట మండలకేంద్రానికి చెందిన కూరపాటి రాంబాబు తనకు రెండు కాళ్లు పనిచేయక పోవడంతో దివ్యాంగుడిగా మారానని తనకు పింఛన్ మంజూరు చేయాలని బ్యాటరీ సైకిల్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కురవి మండల కేంద్రానికి చెందిన బండారి రమేష్ తన విజ్ఞప్తి అందిస్తూ బస్టాండ్ పక్కనే ఉన్న తన ప్లాట్ కు వెళ్లే రహదారిని ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తొర్రూరు మండలం అమ్మాపురంకు చెందిన డొనక శ్రీరాములు తన దరఖాస్తు అందిస్తూ గ్రామంలో అపరిశుభ్రత వాతావరణం నెలకొందని సిసి రోడ్లు మురుకు కాలువలు వ్యక్తిగత మరుగుదొడ్లు అంగనవాడి కేంద్రాలు పరిశుభ్రత లేకపోవడం సర్పంచు పట్టించుకోవడంలేదని పాఠశాల విద్యార్థులు మూత్ర విసర్జనకు మలవిసర్జనకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిని అందజేశారు. ఈ గ్రీవెన్స్ డే లో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, డేవిడ్, జెడ్పి సీఈవో రమాదేవి, డిఆర్డిఏ పిడి సన్యాసయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు