ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట

సమస్యలు తెలుసుకుంటున్న సిపిఎం నేతలు
గుంటూరు,జూన్‌10(జ‌నంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను గుర్తించి అధ్యయనం చేయడం కోసమే ఇంటింటికి సీపీఎం కార్యక్రమం చేపట్టినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబురావు తెలిపారు. కరోనాతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ధరల భారాలు మోపుతున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇంటింటికి సీపీఎంలో ప్రజలను భాగస్వాములు చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. కొవిడ్‌ అనంతరం ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం రాలేదని ప్రజలు వాపోతున్నారు. పైగా ఇంటిపన్ను, చెత్తపన్ను, కరెంటు చార్జీల
పేరుతో ఆర్థిక భారాలను మోపారని ఆవేదన వ్యక్తంచేశారు. పింఛన్లను రద్దుచేశారని, బిల్లులు చెల్లించలేదని కరెంటు విూటర్లు ఊడతీసుకు వెళుతున్నారని తమ గోడు వెలుబుచ్చారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు బతికే అవకాశమే లేకుండా పోయిందని అన్నారు. అందుకే సిపిఎం ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు.