ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తాం

పోసనబోయిన హుస్సేన్ హుజూర్ నగర్ సెప్టెంబర్ 8 (జనం సాక్షి): ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించి, ప్రజలను చైతన్య పరుస్తూ ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని సిపిఎం మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని అమరారం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం తేనె సీతారాములు అధ్యక్షతన జరిగిందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్ మాట్లాడుతూ మండలంలో ప్రజా సమస్యలపై ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికీ మండలంలో సీజన్ వ్యాధులుతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారన్నారు. మండల వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, డబల్ బెడ్ రూమ్, దళితులకు మూడు ఎకరాలు భూ పంపిణీ, దళిత బంధు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రైతులకు రైతుబంధు అనేక సమస్యలపై గ్రామాలలో ప్రజలను చైతన్యం చేస్తూ సర్వే నిర్వహించి స్థానిక సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారన్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. మండల వ్యాప్తంగా రోడ్లు, అనేక గ్రామాలలో వర్షాలు వస్తే ప్రజలు నడవలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు. సంబంధిత అధికారులు రోడ్లను మరమ్మత్తులు చేయించడంలో ఆర్ అండ్ బి అధికారులు విఫలమైనారని వారన్నారు. గ్రామాలలో కొత్త పెన్షన్లకు ఆన్లైన్ చేసుకుంటున్నా, అధికారులు కొత్త పెన్షన్లకు టైము లేదు అని ప్రజలను, వికలాంగులను, ఒంటరి మహిళలను ఇబ్బందులు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా పోరాటాలకు ప్రజలను పెద్ద ఎత్తున కదిలించి అధికారులను ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం శాఖ కార్యదర్శి షేక్ ఖాసిం, షేక్ సైదా, కదిర రామ నరసమ్మ, అరవిందు, డివైఎఫ్ఐ నాయకులు. తేనె బాల సైదులు, ఉప్పరాజు, బాల సైదులు, మహేష్, కాశీం తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు