ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే పబ్లిక్‌ గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు

వేములవాడ, జూలై 31 (జనంసాక్షి) : ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పు కొని వారి సమస్యలను తక్షణం పరిష్కరించడానికే జిల్లా పోలీస్‌ యంత్రాంగం తరపున పబ్లిక్‌ గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ డా. రవీందర్‌ పేర్కొన్నారు. వేములవాడలోని పోలీస్‌ స్టేషన్‌లో మంగళ వారం ఆయన రిసెప్షన్‌ సెంటర్‌ ప్రారంభించారు. అనంత రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ, ప్రజలకు పోలీసులు మరింత చేరువ కావడానికి గాను వారి దైనందిన జీవనంలో ఏర్పడే తగాదాలు, కుటుం బ సమస్యలతో పాటు పోట్లాటలు తదితర సమస్యలను పరిష్కరించడానికి జిల్లాలోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఒక రిసెప్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో రిసెప్షన్‌ సెంట ర్‌లో డ్యూటీ ఆఫీసర్‌ను నియమిస్తామని, తమ సమస్యల పరిష్కారానికై  ప్రజలు వారి ఫిర్యాదులను వాత పూర్వకంగా ఇచ్చినట్లయితే ఆ ఫిర్యాదుకు సంబంధించి రిజిస్టర్‌లో కేసు నమోదు చేయడంతో పాటు ఫిర్యాదుదారునికి సంబంధిత రిసిప్ట్‌ గానీ ఎఫ్‌ఐఆర్‌ కాపీ గానీ ఎలాంటి రుసుము లేకుం డా అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా సమ స్యలపై ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని ప్రజలు నిర్భయం గా, ఎలాంటి సంకోచం లేకుండా వినియోగించుకోవాలని ఎస్పీ రవీందర్‌ కోరారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఓయస్‌డి జానకి ధరావత్‌, వేములవాడ రూరల్‌, పట్టణ సీఐలు జితేందర్‌రెడ్డి, సామల్ల ఉపేందర్‌లు పాల్గొన్నారు.

జిల్లాలో మావోయిస్టుల ఉనికి లేదు :

కరీంనగర్‌ జిల్లాలో మావోయిస్టుల ఉనికి పూర్తిగా అంతరించిందని ఎస్పీ డాక్టర్‌ రవీందర్‌ స్పష్టం చేశారు. కాగా జిల్లా సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌ నుండి అప్పుడప్పుడూ ఒక టీం సరిహద్దు గ్రామాలకు వస్తున్నా జిల్లాలో వారి కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయని పేర్కొన్నారు. అడవుల్లో ఉండి నక్సలైట్లు సాధించేదేమీ ఉండదని,  జనజీవన స్రవంతిలో కలసి ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ఈ సందర్భంగా ఎస్పీ రవీందర్‌ హితవు పలికారు.

తాజావార్తలు