ప్రతికూలతల నడుమ కొనసాగుతున్న సహాయ చర్యలు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణంలో సైన్యం చేపట్టిన సహాయ చర్యలు ముందుకు సాగడం లేదు. సహాయం కోసం ఇంకా 8వేల మంది యాత్రికులు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అధికారి లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 822 మంది యాత్రికులు మృతిచెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ 142 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సామూహిక అంత్యక్రియలకు ఆలస్యమవుతోంది. దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ నుంచి మూడు ప్రత్యేక వైద్యబృందాలు ఉత్తరాఖండ్ చేరుకున్నాయి.