ప్రతిపక్షాలు ఎందుకు పారిపోయాయి
– ప్రజలకు సమాధానం చెప్పాలి
– కోటి ఎకరాలకు సారునీరు అందించి తీరుతాం
– సీఎం కేసీఆర్
నిజామాబాద్,ఏప్రిల్ 2(జనంసాక్షి): తెలంగాణలో 30 ఏళ్ల విద్యుత్తు కష్టాలను తమ ప్రభుత్వమే తీర్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కోటి ఎకరాలకు నీరు ఇచ్చితీరుతామని మరోసారి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటన ముగించుకొని బాన్సువాడ నుంచి ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు. బాన్సువాడ నియోజకవర్గానికి కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించారు. 76 పంచాయతీలకు రూ.15లక్షల చొప్పున ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. బాన్సువాడ అభివృద్ధికి రూ.కోటి రూపాయలను మంజూరు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తిమ్మాపూర్ గ్రామస్తులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 2018-19 నాటికి రైతులకు 24 గంటల త్రీఫేజ్ కరెంట్ ఇస్తామన్నారు. మంజీరా నదిపై చెక్‌డ్యాంలు నిర్మిస్తామని చెప్పారు. కాళేశ్వరం నీళ్లతో నిజాంసాగర్ కళకళలాడుతదని తెలిపారు. కోటగిరిలో మైనార్టీ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. బాన్సువాడ అభివృద్ధికి రూ. కోటి ఇస్తామని తెలిపారు. ప్రతి గ్రామానికి రూ. 15 లక్షల చొప్పున 76 గ్రామాలకు ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి మండల కేంద్రానికి రూ. 25 లక్షలు ఇస్తామని చెప్పారు.కాళేశ్వరం నుంచి నిజాంసాగర్‌కు నీళ్లు ఇచ్చితీరుతామని హావిూ ఇచ్చారు. 2019లో 24 గంటలపాటు 3 ఫేజ్ విద్యుత్ అందిస్తామన్నారు. సాగునీరు తెస్తామని ప్రభుత్వం చెబుతుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కాంగ్రెస్, టిడిపిలు పారిపోయాయని ఆక్షేపించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు తెరాస వైపే నిలిచారన్నారు. డిపాజిట్లు కూడా దక్కించుకోని కాంగ్రెస్ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల మద్దతుగా ప్రజల తెలంగాణ సాధిస్తామని అన్నారు. రెండు పడక గదుల ఇళ్లపై కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. రెండు తరాలకు నివాస కష్టాలు తీర్చడమే తమ లక్ష్యమన్నారు. ప్రజా సంక్షేమం కోసం అప్పులు చేస్తామని, అసెంబ్లీ, సచివాలయ భవనాల నిర్మాణాలను తప్పనిసరిగా కట్టితీరుతామని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజలంతా
టీఆర్‌ఎస్‌ను దీవిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరికీ భయపడమని తేల్చిచెప్పారు. కోటి ఎకరాలకు నీరిచ్చి తీరుతామని ఉద్ఘాటించారు. ఎవరూ అడ్డువచ్చిన ప్రాజెక్టుల విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీకి రాకుండా పారిపోయారు, బయట పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి ఏడాది ప్రాజెక్టుల కోసం రూ. 25 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. కాలమైన సంవత్సరం కూడా తాగునీటికి కరువే అని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథ ద్వారా శాశ్వత చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అనుకున్న సమయంలోగా మిషన్ భగీరథను పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు.
తిమ్మాపూర్ వెంకన్నకు సిఎం పదిలక్షల విరాళం
నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లో కొలువై ఉన్న వేంకటేశ్వర స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సుదర్శన యాగంలో కేసీఆర్ దంపతులు, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తిమ్మాపూర్‌గుట్ట శ్రీవేంకటేశ్వరస్వామిన ఆలయాన్‌ఇన తిరుమల తరహాలో అభివృద్దిచేయాలన్నారు. అందుకు నిధులు కేటాయిస్తానని అన్నారు. తనవంతుగా సిఎం పదిలక్షల విరాళాన్ని ప్రకటించారు. . బ్ర¬్మత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సుదర్శనయాగంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిమ్మాపూర్‌గుట్ట ఆలయం అద్భుతంగా ఉందని, ఆలయ అభివృద్ధి కోసం పనిచేసిన వారికి అభినందనలు తెలిపారు. ఆలయానికి రూ.10లక్షల 116లు విరాళం ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో రూ.10కోట్లతో కల్యాణ మండపం కట్టిస్తామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడితే రూ.5కోట్లతో ఆభరణాలు తయారు చేయిస్తానని తిరుమల శ్రీవారికి మొక్కుకున్నాని, త్వరలో శ్రీవారి మొక్కు చెల్లించుకోనున్నట్లు చెప్పారు. దేశంలో దాతృత్వానికి కొదవ లేదని, దాతల సహకారంతో తిమ్మాపూర్ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నట్లు చెప్పారు.




