ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘ఇండియా’ రెండో రోజు సమావేశం
ముంబయి:2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘ఇండియా’ సన్నద్ధమవుతోంది. నేడు ముంబయి వేదికగా రెండో రోజు సమావేశమవనుంది.
28 పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు. నిన్న జరిగిన డిన్నర్ భేటీలో కూటమికి లోగోను ఎంపిక చేయడంతోపాటు సమన్వయ కమిటీ, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. నేడు తుది నిర్ణయం తీసుకోనున్నారు.
సమావేశం జరగునున్న హోటల్ గదికి కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీలు హాజరయ్యారు.