ప్రతిపౌరుడు సురక్షితంగా ఉండాలి
-పోలీస్ కవిూషనర్ విబి కమలాసన్‌రెడ్డి
కరీంనగర్, సెప్టెంబర్ 1 (జనంసాక్షి):ప్రతి పౌరుడు కూడా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే కవిూషనరేట్ పరిధిలో వివిద రకాల చర్యలుతీసుకుంటున్నామని కరీంనగర్‌ను శాంతికి నిలయంగా చేస్తు/-న్న ప్రయత్నాల్లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. గణెళిష్ నిమజ్జనం, బక్రీద్ పర్వదినం సందర్బంగా శుక్రవారం పోలీస్ కాన్పరెన్స్ హాల్లోఎ వివిద పార్టీలకు చెందిన ప్రతినిధులు ప్రజాప్రతినిధులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కవిూషనర్ మాట్లాడుతూ కరీంనగర్‌ను స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దేందుకు పోలీస్‌శౄఖ కృషి చేస్తుందన్నారు. మత సామరస్యాన్ని కాపాడాల్సి బాద్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్ని వర్గాల ప్రజలు కుల మత వర్గ విబేదాలను విడనాడి ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మద్యం మత్తు పదార్తాలను
సేవించిన వారిని నిమజ్జనం ఊరేగింపులోకి రాకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఊరేగింపులో వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ప్రమాదం ఉంటుందన్నారు,. వివిద మతాల మనోబావాలకు భంగం కలిగే విదంగా నినాదాలు చేయకూడదన్నారు. నవరాత్రోత్సవాల సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మండపాల వద్ద పోలీస్‌లను నియమించడం జరిగిందన్నారు. ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి నిమజ్జన ఊరేగింపును తిలకించేందుకు వీలుగా నిర్వాహకులు మద్యాహ్నం వరకు ఊరేగింపులను ప్రారంభించాలన్నారు. నిమజ్జనానికి సంబందించిన ఎర్పట్లన్నీ పూర్తయ్యాయని, నిమజ్జనం జరిగు ప్రదేశాల్లో వివిద ప్రభుత్వ శాఖల సమన్వయంతో జాయింట్ కంట్రోల్ రూంలనను ఏర్పాటు చేశౄమన్నారు. వివిద మండపాలవద్ద ఏర్పాటు చేసిన విగ్రహాలు ఎక్కడ నిమజ్జనం చేయాలో నిర్దేశించి నిర్వాహకులకు చెప్పామన్నారు. చిన్న విగ్రహాలరను తీసుఏకెల్లే క్రమంలో నిర్వాహకులు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. నిమజ్జనం సందర్బంగా భక్తులు అస్వస్థతకు గురైనా ప్రథమ చికిత్సఅందించేందుకు నిమజ్జనం వెల్లే దారుల్లో వైద్య శిభిరాలను ఏ/-ర్పాటు చేయడంతోపాటు అంబులెన్స్‌లను అందుబాటలో ఉంచుతున్నామన్నారు. సాంకేతిక సమస్యలతో బస్‌లు నిలిచిపోతే ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా ఉండేందుకు ఆర్టీసీ మెకానిక్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. మేయర్ రవిందర్ సింగ్ మాట్లాడుతూ నిమజ్జనానికి వెల్లే ప్రాంతాల్లో రోడ్ల
మరమ్మత్తులను యుద్ద ప్రాతిపదికపై చేపడుతున్నామన్నారు. ప్రజాప్రతినిధులు వివిద పార్టీలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించడం మంచి నిర్ణయమన్నారు. కార్పోఎరేషన్ పక్షాన అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. సమావేశంలో డిప్యూటి మేయర్ గుగ్గిల్లరమేశ్, ఎసిపిలు రామారావు, తిరుపతి, ఇన్స్‌పెక్టర్లు మహేశ్‌గౌడ్ రమెశ్ రాంగోపాల్ రెడ్డి (సిపిఐ), అబ్బాస్ షవిూ (ఎంఐఎం), ముకుందరెడ్డి (సీపీఎం), గందె మహేశ్, శ్రీనివాస్, ప్రసాద్ (కాంగ్రెస్) సత్యనారాయణరెడ్డి, నేతికుంట యాదయ్య, హరిశంకర్ (టీఆర్‌ఎస్) లు పాల్గొన్నారు.