ప్రతిరోజు సైకిల్ తొక్కడంతో ఆరోగ్యం
రెండవ పట్టణ సిఐ సురేష్
మిర్యాలగూడ, జనం సాక్షి.
ప్రతిరోజు సైకిల్ రైడ్ చేయడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మిర్యాలగూడ రెండవ పట్టణ సిఐ సురేష్ అన్నారు. రంగా శ్రీధర్ సౌజన్యంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ఎన్ ఎస్ పి క్యాంపు నుండి ఈదుల కూడా చౌరస్తా వరకు నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ లో సిఐ మాట్లాడుతూ సైకిల్ ని వాడడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోదపడుతుందని పిలుపునిచ్చారు. రంగా శ్రీధర్ గారు మాట్లాడుతూ రైడ్ సైకిల్ లైవ్ హెల్త్ కాన్సెప్టును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని లక్ష్యంతో ఈ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి రంగా శ్రీధర్ టీ షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రంగా శ్రీధర్, రెండవ పట్టణ సీ ఐ.సురేష్, టీ ఎస్ యూ టీ ఎఫ్ నాయకులు బక్కా శ్రీనివాస్ చారి,జె వి వి నాయకులు. ఆర్ . అమరయ్య, కోలా శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సతీష్, డాక్టర్ శ్రీనివాస్ రాజు, డాక్టర్ రాజు, డాక్టర్ ప్రసన్నకుమార్, డాక్టర్ రవితేజ, పండిత్ రెడ్డి,మోర్తల శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి, చిట్టిప్రోలు శ్రీనివాస్,డి . వెంకట్ రెడ్డి, పాల్వాయి శ్రీనివాస్, ఆడావత్ చిన్న వెంకన్న, ఎల్. కోట నాయక్, సూరారెడ్డి, చిర్రా శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు..