ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్
– దత్తత గ్రామాల్లో సమగ్రాభివృద్ధి
– ప్రజలతో సీఎం కేసీఆర్ ముఖాముఖి
మెదక్,జూన్ 10(జనంసాక్షి):ప్రజల సంఘటితంలోనే శక్తి ఉందని, దానిని గుర్తించి గ్రామాల అభివృద్దికి కలసికట్టుగా పనిచేయాలని దత్త గ్రామాలయిన ఎర్రవల్లి,నర్సన్న పేట ప్రజలకు సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. సంఘటితంగా సాగి గ్రామాలను అభివృద్ది చేసుకుంటూ ఇతర గ్రామాలకు ఈ రెండు గ్రామాలు ఆదర్శంగా నిలవాలన్నారు. ఇక్కడ స్వయం ఉపాధి, వ్యవసాయ అభివృద్ది తదితర పథకాలకు ఇస్తున్న నిధులు ఏ గ్రామాంలోనూ ఇవ్వడం లేదని గుర్తుంచుకోవాలన్నారు. ఇతర గ్రామాల్లో కూడా అభివృద్ది జరగాలంటే ఇక్కడ మోడల్‌గా తయారవ్వాలన్నదే తన తపనని అన్నారు. ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఎర్రవెల్లిలో నిరుపేదలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. గ్రామంలోని యువకులకు 42 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయి ఇళ్లలోకి వెళ్లినప్పుడే మనకు పండుగన్నారు. ఎర్రవెల్లి, నర్సన్నపేటలో ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇవ్వడానికి రిలయన్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఇంటిటికీ గోదావరి నీళ్లు, 24 గంటలు తాగునీరు అందుబాటులో ఉంచేందుకు ప్రతి ఇంటికి ట్యాంక్ ఉంటుందని తెలిపారు. ఎర్రవెల్లి స్వయం సంవృద్ధి గ్రామం. గ్రామంలో ఏ అభివృద్ధి జరిగినా ప్రజలందరికీ తెలియాలి. రెండేళ్ల తరువాత పాములవర్తికి గోదావరి జలాలు వస్తాయి. రైతులకు అవసరమైన ఎరువులు నేరుగా ఎర్రవెల్లికే వస్తయి. గజ్వేల్‌కు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పంచాయితీలు పెట్టుకొని సమయం వృథా చేసుకోవద్దు. పంచాయితీలు, కొట్లాటలు లేకుండా గ్రామస్తులే చూసుకోవాలి. గన్ ఫెన్సింగ్ కంటే… సోషల్ ఫెన్సింగే బలమైంది. ఇండ్లలోకి వెళ్లే సమయానికి ప్రతి ఇంటికి రెండు పాడి గేదెలు అందజేస్తామని వెల్లడించారు. అలాగే ఉచితంగా కోళ్లను కూడా ఇస్తామన్నారు. వర్షాలు బాగా పడి చెరువులు నిండితే రెండో పంటకు ఢోకా ఉండదని పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి పది దేశవాలీ కోళ్లను ప్రభుత్వమే కొనిస్తుందని అన్నారు. . 2800 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తున్నాం. వ్యవసాయశాఖ ఆగ్రానమిస్టు సలహాలు.. సూచనలతో పంటలు సాగు చేద్దాం. భూమిలేనివారిని ఆదుకునేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయి. ఎర్రవల్లి గ్రామం పువ్వులా కనిపించాలి. ప్రజల సంఘటిత శక్తితో చాలా బలముంది. ప్రజలంతా ఐక్యంగా ఉండి గ్రామాలను దేశానికే ఆదర్శంగా నిలపాలని సూచించారు. ఆగస్టు 4 తర్వాత డబుల్ బెడ్ రూంల ఇళ్ల గృహ ప్రవేశం జరుగుతుందన్నారు, ఎర్రవల్లిలో నీటి కష్టాలు లేకుండా కొత్తగా నిర్మిస్తున్న ప్రతీ ఇంటిపై వాటర్ ట్యాంక్ ఉంటుందన్నారు. 24 గంటలు నీళ్లు ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మన ఊరును మనమే బతికించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరిపై ఆధార పడకుండా.. ప్రతీ ఒక్కరికీ ఉపాధి కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎర్రవల్లిలో ఎవరూ పనిలేకుండా? పస్థులుండకూడదన్నారు. ఊరిలో జరిగే ప్రతి పని గ్రామప్రజలందరికీ తెలియాలన్నారు. ఇందుకోసం కమ్యూనిటీ హాల్ ను నిర్మిస్తున్నట్లు కూడా తెలిపారు. హైదరాబాద్ నుంచి ఎర్రవల్లికి వచ్చేలా అభివృద్ధి జరగాలన్నారు. . భూమి లేని ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. గ్రావిూణ యువతకు పని కల్పించే లక్ష్యంతో తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ 42 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. రూ.3.36కోట్ల నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్లను 42 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో భూమిలేని నిరుద్యోగులు, ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి ట్రాక్టర్లు ఇచ్చి ఇరు గ్రామాల్లో దుక్కి దున్నించే లక్ష్యంతో వీటి పంపిణీ చేపట్టారు. ఇరు గ్రామాల్లో ఏర్పాటుచేసిన 14 జోన్లలో పొలాలు ఒక్కో జోన్‌కు మూడు ట్రాక్టర్లు ఇచ్చారు. పంపిణీ చేసిన వాటిలో మూడు రకాలు ఉండగా అందులో అధికశాతం మట్టి తవ్వేందుకు, లోతుగా దుక్కి దున్నేందుకు ఒకటి, ప్రతి జోన్‌కు శక్తివంతమైన ట్రాక్టరుతో పాటు మధ్యస్తంగా ఒకటి, మరో చిన్న ట్రాక్టరును కేటాయించారు. వీటిని గ్రామ అభివృద్ధి కమిటీల పేరిట రిజిస్టర్ చేయించి మూడేళ్ల తర్వాత యువకులకు బదిలీ చేయనున్నారు. తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దీనిపై రిలయన్స్ సంస్థ ఇప్పటికే సర్వే చేసిందన్నారు. హైదరాబాద్‌లో ఉండే అన్ని సౌకర్యాలు ఈ రెండు గ్రామాల్లో కల్పించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో నీటి ఎద్దటి లేకుండా చేస్తామన్నారు. తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలతో ఈరోజు ఆయన ముఖాముఖియ నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లోని యువకులకు 42 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. గ్రామాల్లో ఎవరూ పనిలేకుండా ఉండొద్దని కేసీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జెసి వెంకగ్రామా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




