ప్రతి ఇంటికి మంచినీరు
– కోటి ఎకరాలకు నీరు అందిస్తాం
– తెలంగాణ శరవేగంతో అభివృద్ధి చెందుతుంది
– గణతంత్య్ర వేడుకల్లో గవర్నర్
– హాజరైన సీఎం కేసీఆర్
హైదరాబాద్,జనవరి26(జనంసాక్షి): ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ అమలు చేస్తుందని గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ తెలిపారు. మన వూరు-మన చెరువు ద్వారా గ్రామాల్లో నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని కోటి ఎకరాలకు నీరందించే దిశగా చెరువుల పునరుద్ధరణ జరుగుతోందని, 2018 నాటికి రాష్ట్రంలో 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కవాతు మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వారా తెలంగాణ ప్రజల కల సాకారమైందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అవినీతిరహిత పాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని నరసింహన్ స్పష్టం చేశారు.ఎందరో మహానీయుల త్యాగఫలమే ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్స్ ఇండ్లతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. సంక్షేమ పథకాల అమలులో దేశంలో రాష్ట్రం ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలో విద్యుత్ సమస్య నివారణకు ప్రభుత్వం కృషి చేస్తుందని గవర్నర్ వివరించారు. మన ఊరు – మన చెరువు ద్వారా గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటుంది. 2018 నాటికి 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించేందుకు చెరువుల పునరుద్ధరణ జరుగుతుంది. ఇంటింటికి తాగునీరందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ అమలు చేస్తుంది. రాష్ట్రంలో రెండు పడక గదుల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో ఇప్పటికే 66 వేల డబుల్ బెడ్‌రూమ్స్ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. స్టార్టప్ హబ్‌గా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుంది. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ ఇదే కావడం విశేషం. . దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా ఆడబిడ్డల పెండ్లిళ్లకు రూ. 51 వేలు ఇస్తుంది ప్రభుత్వం. దళిత యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తున్నాం. సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యంతో ప్రభుత్వం భోజనం పెడుతుందన్నారు. బోనాలు, బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తుంది. మేడారం జాతర కోసం భారీగా నిధులు కేటాయించారు. తెలంగాణ కళలను ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటు పడుతుంది. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర ముందంజలో ఉందని గవర్నర్ పేర్కొన్నారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌స్లో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనం జరిగాయి. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్రమంత్రులు జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ కవాతు మైదానంలోని అమర జవాన్ల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.