ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కాంగ్రెస్తోనే సాధ్యం

బచ్చన్నపేట నవంబర్ 17 ( జనం సాక్షి)
దేశంలో కానీ. రాష్ట్రంలో కానీ ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాలంటే అది ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బచ్చన్నపేట మండలంలోని రామచంద్రపురం. కొన్నే. దబగుంటపల్లి. లింగంపల్లి. మన్సాన్పల్లి. సాల్వాపూర్ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు ప్రతి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నేను స్థానికున్నని ఇక్కడి సమస్యలు బాధలు నాకు తెలిసి ఉంటాయని స్థానికేతరుడైన పళ్ళ రాజేశ్వర్ రెడ్డి కి ఏం తెలుసు అని అన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పల్లాపై చేసిన విమర్శలు భూ కబ్జా కోరని. తన చెల్లెలి కాలేజీని ఆక్రమించుకున్నాడని. దోచుకోవడం దాచుకోవడం ఆయనకు అలవాటని సొంత పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ముత్తిరెడ్డి అన్నారని గుర్తు చేశారు. అలాంటి అలాంటి వాన్ని గెలిపిస్తే మన నియోజకవర్గం వెనుక పడుతుందని దానికి ఉదాహరణ గత 8 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా ఉంటూ ఏమి చేయలేదని కనీసం జనగామ వైపు కన్నెత్తి కూడా చూడలేదని. జనగామ నియోజకవర్గంలో ఆయన ఎవరికీ పరిచయం లేదని అలాంటివాడు నా గురించి నా కుటుంబం గురించి మాట్లాడడం అతని అవివేకానికి నిదర్శనం అన్నారు. దమ్ముంటే మా ఊరికి వచ్చి నా గురించి మా కుటుంబం గురించి తెలుసుకొని మాట్లాడాలని లేదంటే నేనే మీ ఊరికి వస్తానని నీవు ఎలాంటి వాడివో నిరూపిస్తానని సవాల్ విసిరారు. ఆరు సంక్షేమ పథకాల గురించి వివరించి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నన్ను అందరూ ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొని బాలకిషన్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వంచ వెంకట్ రెడ్డి. నిడిగొండ శ్రీనివాస్. పడమటి కేశపురం సర్పంచి గిద్దల రమేష్. బచ్చన్నపేట పట్టణ అధ్యక్షులు కోడూరి మహాత్మాచారి. చెరుకూరి శ్రీనివాస్.జంగిటి విద్యనాథ్.ఉమెంతల మల్లారెడ్డి.కామిడి రమేష్ రెడ్డి.ఆముదాల మల్లారెడ్డి. పిట్టల ఇస్తారి. రోండ్ల తిరుపతి రెడ్డి. తమ్మడి మహేందర్. దిడ్డిగా రమేష్. మండల మహిళా అధ్యక్షురాలు బొమ్మెర్ల వేణు వందన.అవధూత శ్రీనివాస్. బడే కోల్ శ్రీనివాస్ రెడ్డి. ఈదులకంటి వెంకట్ రెడ్డి. అల్వాల ఎల్లయ్య.దేవరకొండ రమేష్ ఉన్నారు

తాజావార్తలు