ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే
జగిత్యాల,డిసెంబర్17(జనంసాక్షి): ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమై లక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చెప్పారు. విద్యా వైద్యం, నీళ్లు అందించేందుకు కృషి చేస్తానన్నారు. రైతు బందు పథకం దేశానికే అదర్శమన్నారు. ఇప్పటివరకు ఎకరాకు 4 వేల పెట్టుబడి అందించామనీ, ఇప్పుడు 5 వేలు అందిస్తున్నట్లు చెప్పారు. వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో ప్రతి పక్షాలకు డిపాజిట్లు రాకుండా ప్రజలు ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పినట్లు వివరించారు. రైతు కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ అనీ, రైతుబంధు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశగతిని మార్చేందుకే దేశ రాజకియాలవైపు కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అందరికీ ఇష్టమైన యువనాయకుడు కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించి దేశ రాజకీయాలవైపు చూస్తున్నట్లు చెప్పారు. పథకాలను చూసి దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు.
నిజామాబాద్ ఎంపీ కవిత సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సంజయ్ కుమార్ తెలిపారు. గత నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యో గులకు పెద్ద పీట వేసిందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు సంఘీభావం ప్రకటిస్తూ అండగా ఉంటామన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.