ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 19 (జనం సాక్షి);

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.శనివారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేను తప్పక ఓటు వేస్తాను నినాదంతో నూతన కలెక్టర్ కార్యాలయం నుండి కృష్ణవేణి చౌక్ వరకు ఏర్పాటు చేసిన 5కే రన్ ను జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేను తప్పక ఓటు వేస్తాను రాబోయే ఎన్నికల కోసం ఓటర్ కార్డులు సవరణ కేంద్రాలు ఏర్పాటుచేయడం జరుగుతుందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పక ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకు గాను ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించు కోవాలన్నారు. అక్టోబర్ ఒకటి 2023 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. మీ ఇంటిలో ఎవరైనా అన్నాతమ్ముళ్ళు , అక్కా చెల్లెలు ఎవరు ఉన్నా వారికి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్ జాబితాలో నమోదు చేయించాలని అన్నారు. ముందుగానే ఓటు హక్కు ఉన్నవారు ఓటర్ జాబితా లో ఓటు ఉందా లేదా అని ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ మాట్లాడుతూ నేను తప్పక ఓటు వేస్తాను అనే కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పై అవగాహన కలుగుతుందని అన్నారు. ఓటు అమూల్యమైనదని , ఎలాంటి ప్రలోబాలకు లొంగకుండా ఓటు హక్కు ను నిర్భయంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యేలు , ఎంపీలను ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటామని , డబ్బు , మద్యం ఇతర ఆకర్షణలకు లొంగకుండా ఓటు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమములో జిల్లా అధికారులు , తహశిల్దార్ లు , ఎం పి డి ఓ లు , ఉద్యోగులు , విద్యార్థిని,విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.